పేదోడి నమ్మకానికి, నేడు జన్మదినం…

Google+ Pinterest LinkedIn Tumblr +

క్రితం రాత్రి డిజైన్‌ చేయించిన పేజీల్లో ఏమైనా తప్పులొచ్చాయా అని, ఉదయం, టెన్షన్‌గా వెతుకుతుంటే నోకియా ఫోన్‌ రింగ్‌ అయింది. 
‘ మేటర్‌ సీరియస్‌.. నందిగామ నుండి మా బంధువులొచ్చారు. వారి నెలల పాపకు హార్ట్‌ప్రాబ్లం.. ఏమైనా హెల్ప్‌ చేయగలమా?’ అవతల ఆందోళనగా మురళి. 
…………………….
11గంటలకు టీవీ9 ఆఫీసులో మిత్రుడు చంద్రమౌళి దగ్గరున్నాం. ‘ మీ బ్రదర్‌ హార్ట్‌ స్పెషలిస్టు కదా ఈ పసిబిడ్డను కాపాడాలి గురూ?’ అన్నాను. 
……………………
12గంటలకు బంజారాహిల్స్‌లో స్టార్‌ ఆసుపత్రికి పసిబిడ్డనుతీసుకుని నందిగామ జంట వచ్చారు. వారికి రెండెకరాల పొలం తప్ప ఏమీ లేదు. వ్యవసాయం మీద బతుకుతారు. లేక,లేక పుట్టిన బిడ్డకు ఇలా కావడంతో ఆతల్లి కన్నీళ్లు పెడుతోంది. 
టెస్టులన్నీ అయ్యాక తేలిందేంటంటే , దాదాపు 3లక్షలు ఖర్చువుతుంది. చంద్రమౌళి పంపించారు కాబట్టి కొంత తగ్గుతుంది. 
వెంటనే ఆ బిడ్డ తండ్రి ఎవరికో ఫోన్‌ చేసి పొలం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోమని, చెబుతున్నాడు. అతడిని కొంచెం ఓపిక పట్టమని చెప్పి, ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అని అడిగాను. లేదు తెల్లకార్డు ఉందన్నాడు. దానిని పట్టుకొని సీఎం క్యాంపు ఆఫీసుకు చేరుకున్నాం. అక్కడ ఆరోగ్యశ్రీనెట్‌వర్క్‌ కౌంటర్‌లో ఇచ్చి నా అక్రిడేషన్‌ కార్డు చూపించి పరిచయం చేసుకున్నాను. వారు రిపోర్టులో వివరాలు కంప్మూటర్‌లో ఫీడ్‌ చేసుకొన్నారు.
……………………. 
వారం తరువాత నందిగామ జంట సంతోషంగా లక్డీకపూల్‌లో కనిపించారు.’ ఒక్క రూపాయి కూడా ఖర్చుకాకుండా ఆపరేషన్‌ సక్సెస్‌. మా బిడ్డ బతికింది, మా బతుకు తెరువైన పొలం కూడా దక్కింది.’ అంటూ వారు ఉధ్వేగంగా, నా చేతులు పట్టుకున్నారు. 
” థ్యాంక్స్‌ నాకు కాదమ్మా, ఆరోగ్యశ్రీని తెచ్చిన సీఏం వైఎస్‌ గారికి చెప్పండి…” అన్నాను. ఇదంతా 2008లో సంగతి. 
పేదోడి నమ్మకానికి, నేడు జన్మదినం . 
( PIC- జూబ్లీహాలులో మా కార్టూన్‌ షోని ఏదైనా గీత గీసి ప్రారంభించండి సార్‌? అని అప్పటి ముఖ్యమంత్రి గారిని అడిగితే ‘ నువ్వు గీసి చూపించు, తరువాత నేను గీస్తా…’ అని మాతో సందడిగా గడిపిన క్షణాలు… )

Share.

Leave A Reply