మనలో ఒకడు

Google+ Pinterest LinkedIn Tumblr +

మనలో ఒకడు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మొయిదా జంక్షన్‌లో బుధవారం(3.10.2018) నాటి బహిరంగ సభలో జగన్‌ స్పీచ్‌ స్టార్ట్‌ చేశారు.తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయి, రోడ్డు మొత్తం ఇసుకవేస్తే రాలనంతా జనంతో నిండిపోయింది. ఆ సమయంలోనే ఓ గర్భిణి ఆ మార్గంలో ఆటోలో వెళ్లాల్సి వచ్చింది. ఆ సంగతి మెల్లగా జగన్‌ వరకు వెళ్లింది. జనసంద్రం మధ్యలో ఆటో చిక్కుకుపోయిందని తెలుసుకున్న జగన్‌ ఓ క్షణం నివ్వెరపోయారు. ఆ వెంటనే జగన్‌ తన ప్రసంగాన్ని పక్కనపెట్టి గర్భిణి ప్రయాణిస్తున్న ఆటోకు దారి ఇవ్వాలని ప్రజలను వేడుకున్నారు.
” అన్న.. అన్న.. ఈ ఆటోకు దారివ్వండన్నా..
అన్న.. అన్న.. ఆటోకి ఇబ్బంది పెట్టొద్దన్నా..
కొంచెం దారి ఇవ్వండన్నా.. కొంచెం కొంచెం జరగండన్నా..’ అంటూ, చంద్రబాబు పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఉండదన్నారు.  ఆ వాహనం వెళ్లే వరకు ఆ గర్భిణీకి దారి ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. వైఎస్‌ జగన్‌ సూచనలతో సభకు హాజరైన జనాలు ఆటో జనసంద్రాన్ని దాటేలా సహాకరించారు. వైద్యారోగ్య శాఖకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిర్వీర్యం చేశారని జగన్‌ మాట్లాడుతూ.. 108 అంబులెన్స్‌ సేవల గురించి ప్రస్తావించారు. అంబులెన్స్‌లు లేక ఆపదలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పడానికి ఈ ఘటన ఓ ఊదాహరణగా నిలుస్తోందన్నారు.

Share.

Leave A Reply