ఫోన్‌చేస్తే ఇంటికే మందులు…

Google+ Pinterest LinkedIn Tumblr +

యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ స్వచ్ఛంద సంస్థ
ఫోన్‌చేస్తే ఇంటికే మందులు తెచ్చి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటూ కదలలేని స్థితిలో, ఎలాంటి ఆసరాలేక, ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత సేవ చేసేందుకు
ఈ సంస్థ పూనుకున్నది. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారు ఫోన్‌ చేయగానే వీరు స్పందిస్తారు వాట్సాప్‌ ద్వారా ప్రిస్క్రిప్షన్‌, చిరునామా వంటివి తెలుసుకొని మెడికల్‌ షాపుల నుంచి మందులు తీసుకొని వారికి అందిస్తున్నారు. బిల్‌ ఆధారంగా నగదు చెల్లించాలి. ఇందుకు ఎలాంటి రుసుం వసూలు చేయడంలేదు. దీంతో ఈ సంస్థ చేస్తున్న సేవ పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌.. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్నాటి రాజేందర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి, వారి సేవలను అభినందించారు.” మందులు అవసరమైన వారు 9491114616, 814330 4148, 703747112, 9182339595, 8897736324 నంబర్లను సంప్రదించాలని, మందు ల కొరత వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నదని, అందుకే ఫోన్‌చేస్తే మందులు అందించే సేవను ఉచితంగా ప్రారంభించామని,మందులకు అయ్యే ఖర్చు లో రూ.200 వరకు సొంతం గా ఖర్చు పెడుతున్నాము భారత పౌరులుగా ఇది తమ బాధ్యత అని సంస్థ అధ్యక్షుడు పల్నాటి రాజేందర్‌ Rural media కి తెలిపారు.

Share.

Leave A Reply