వాటీజ్‌ దిస్‌..? జగన్‌ గారూ ?

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదండీ… మా ఇంటికో మరుగుదొడ్డి అడిగాం… చాలా రోజుల తరువాత ఉపాధి హామీ పథకంలో మంజూరు చేశారు. దానికీ ఇలా పసుపు రంగు అద్దారు. ఈ ఊర్లో అన్ని మరుగుదొడ్లకు ఇదే రంగు… ‘ అని కొంత అసహనంగా చెప్పింది,,విజయనగరం జిల్లా, కొండలక్ష్మీపురంలోని గృహిణి.
ఏడాది క్రితం ‘రూరల్‌మీడియా’ టీం ఉపాధి హామీ పథకం అమలు పై అధ్యయనం కోసం విజయనగరం,చిత్తూరు,ప్రకాశం జిల్లాల్లో ఫీల్డ్‌విజిట్‌ చేసినపుడు, ప్రజల ఆస్తుల పై ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి నిరసనగా అక్కడి ప్రజల స్పందన ఇది.

విజయనగరం జిల్లా, దుప్పాడ లోని శ్మశాన వాటికకు పసుపు రంగు.


శ్మశానాలను వదల లేదు. .
2016.17 ఆర్ధిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో శ్మశాన వాటికల రహదారులను, ఒక షెల్టర్‌, ప్రధాన ద్వారాన్ని,చుట్టూ ప్రహారి గోడలను నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఖర్చుపెట్టిన నిధులు రూ.24.15కోట్లు.
ప్రతీ జిల్లాలోను ఈ పనులను గత ప్రభుత్వం చేపట్టింది. వారి పార్టీ పసుపు రంగు చాలా చోట్ల గోడలకు వేయించారు. మీరిక్కడ చూస్తున్న ఫొటో విజయనగరం జిల్లా ,దుప్పాడ గ్రామంలోనిది.

చిలకలూరిపేట(గుంటూరు జిల్లా)లో పసుపు రంగు,పబ్లిక్‌ టాయిలెట్‌

ఉపాధి హామీ పథకం పనుల బోర్డుకీ పసుపు రంగు.


సొమ్ము కేంద్రానిది, ప్రచారం పార్టీది !
కేంద్రప్రభుత్వ నిధులతో అమలు చేసిన సోలారు బోర్లకు ‘ఎన్టీర్‌ జలసిరులు’ అని, పేదల ఇంటి నిర్మాణాలకు ‘ఎన్టీఆర్‌ ఇళు’్ల అని, అసంఘటిత కార్మికుల బీమా పథకానికి ‘చంద్రన్నబీమా’ అని ప్రచారం చేయడం, ఉపాధిహామీ పనులకు పార్టీ రంగు పులమడం పై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది.
శ్మశానాలు, గ్రామ సచివాలయాలు,టాయిలెట్లు కాకుండా చివరికి నరేగా పనులను తెలిపే బోర్డులకు కూడా పసుపు రంగులు వేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీ రంగును రుద్దడం వల్ల విమర్శల పాలయ్యంది. చివరికి ఎన్నికల్లో ఓడించడం ద్వారా ప్రజలు తమ వ్వతిరేకతను చూపించారు. అదే తప్పు వైసీపీ చేయాలా?

ఎంపీ కేశినేని నాని ట్వీట్‌

గుంటూరు జిల్లాలోని ఓ శ్మశాన వాటిక గోడ రంగును జగన్‌ ప్రభుత్వం మార్చడం పై విజయవాడ ఎంపీ కేసినేని నాని ‘ వీటినీ వదలరా..’ అంటూ, 13.9.2019న ట్విట్టర్‌ లో కామెంట్‌ చేశారు. అయితే ఎంపీ గారికి గతంలో టీడీపీ కూడా రంగులు మార్చిన సంగతి తెలియక పోవడం వల్ల చాలా మంది నెటిజన్లు కౌంటర్‌ ఇచ్చి గుర్తు చేశారు.

కేశినేని నాని ట్వీట్‌ కి కౌంటర్‌గా మరో ట్వీట్‌

” టీడీపీ చేసిన ఇలాంటి పనుల వల్ల విసిగి పోయన జనానికి వైఎస్‌ జగన్‌ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా కనిపించి,అభ్యర్ధి ఎవరని చూడ కుండా జగన్‌ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అది దృష్టిలో పెట్టుకొని వైసీపీ అడుగులు వేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు నిజాయితీగా అమలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు గుండెల్లో దాచుకుంటారు తప్ప, ఇలా పార్టీ జెండాల రంగులను ప్రజా ఆస్తుల పై రుద్దటం వల్ల కాదు, వైసీపీ కూడా టీడీపీ చేసిన తప్పునే చేయడం వల్ల వారికే నష్టం .” అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Share.

Leave A Reply