అమరావతి పై షాకింగ్‌ నిర్ణయం ?

Google+ Pinterest LinkedIn Tumblr +

అమరావతి పై భారత నిపుణులతో అధ్యయనం!!
అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌,నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు సింగపూర్‌, జపాన్‌ దేశాల చుట్టూ తిరుగుతూ ఐదేళ్లు గడిపి, చివరికి కొన్ని తాత్కాలిక భవనాలు నిర్మించి ఆగిపోయారు.
అయితే ఇపుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు అమరావతి విషయంలో ఒక నిర్మాణాత్మక అడుగు వేసింది.
ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విదేశాల వెంట పోకుండా , పట్టణ ప్రణాళికలో అనుభవం ఉన్న భారతదేశంలోని నిపుణులతో కమిటీని నియమించారు.
వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించిన అభివృద్ది ప్రణాళికలను సమీక్షించి, అమరావతితో సహా ఆల్‌రౌండ్‌ అభివృద్ది కి సమగ్ర అభివృద్ది వ్యూహాన్ని సూచించడం కోసం, రాష్ట్ర సమగ్రాభి వృద్దికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రాజధానితోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ది లక్ష్యంగా, కమిటీ అధ్యయనం చేయనుంది. వికేంద్రీకరణ దిశగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న పనులను పర్యవేక్షించడంతోపాటు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభి వృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించడానికి విశేష అనుభవం ఉన్న నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి 13.9.2019న ఉత్తర్వులు జారీ చేశారు.

జీఎన్‌ రావు కన్వీనర్‌గా
ఈ కమిటీకి మాజీ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు కన్వీనర్‌గా, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ డీన్‌ డాక్టర్‌ మహావీర్‌, అర్బన్‌, రీజనల్‌ ప్లానర్‌ డాక్టర్‌ అంజలీ మోహన్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ కె.టి.రవీంద్రన్‌, అహ్మదాబాద్‌ సెప్ట్‌ ప్రొఫెసర్‌ శివానంద స్వామి, చెన్నై చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ (రిటైర్డ్‌) కె.వి అరుణాచలంను ప్రభుత్వం సభ్యులుగా ఎంపిక చేసింది.
గత ప్రభుత్వం అమరావతిలో, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన వివాదాన్ని దృష్టి లో ఉంచుకుని, పర్యావరణం, వరద నియంత్రణ అంశాలపై ఒక నిపుణుడిని సభ్యుడిగా చేర్చుకునే అధికారాన్ని ఈ కమిటీకే అప్పగించింది.
అన్ని ప్రాంతాల అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను కమిటీ రూపొందించి, ఆరు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి.
ఆరోపణలకు తావు లేకుండా…
దేశవ్యాప్తంగా నిపుణులను ఎన్నుకునేందుకు జగన్‌ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఏ విధమైన పక్షపాత ఆరోపణలకు అవకాశం లేకుండా, ఈ కమిటీలో, ఆంధ్ర, తెలంగాణకు చెందినవారు లేకుండా జాగ్రత్తపడ్డారు.
‘ అన్ని ప్రాంతాల అభివృద్ది కి, అపార అనుభవం ఉన్న భారతీయ నిపుణులతో కమిటీ వేయడం ఆహ్వానించ దగిన పరిణామం అని, ప్రభుత్వనిర్ణయం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share.

Leave A Reply