వీరు పని చేయక పోతే, లోకం ఆగిపోతుంది

Google+ Pinterest LinkedIn Tumblr +

కూల్‌గా విండో పక్కన కూర్చొని,మొబైల్‌లో అప్‌ డేట్స్‌ చూసుకుంటా జర్నీ చేద్దామని,
మెదక్‌ వెళ్లే ఆర్టీసీ బస్‌ ఎక్కాను. సీట్లు అన్నీ ఫుల్‌..
రెండు గంటలు ప్రయాణం… ఒక గంట తరువాత ఏదో స్టేజ్‌లో ఆగితే, ఒక సీట్‌ ఖాళీ అయింది. అక్కడ కూర్చుందామనుకుంటే,పక్కనే మహిళ ఉంది. ఆమెకు ఇబ్బందేమో అని మొహమాటం పడుతుంటే,
‘‘ రా అన్నా కూసో..’’ అన్నదామె.
‘‘ ఏడికి పోతున్నరన్నా.. ’’
‘‘ మెదక్‌ లో ఒక రైతును కలవాలని…’’ నా గురించి క్లుప్తంగా చెప్పాను.
మట్టిరంగు నేత చీరలో,బంగారపు ఛాయలో శుభ్రంగా ఉంది. అందంగా లేదుకానీ, ఆకర్షణీయంగా ఉంది. 30 ఏళ్లు ఉండొచ్చు…పొలం పనులు చేసిన మనిషిలా బలంగా ఉంది.
‘‘ మీరేం చేస్తారమ్మా,,, వ్యవసాయమా…?’’
‘‘ లేదన్నా… అంతకంటే కష్టమైనదే… మెదక్‌లో ఉంటా. వస్తే చూపిస్తా…?’’ అంది నిర్లిప్తంగా…. ఇంతలో బస్‌ మా స్టేజీ దగ్గర ఆగింది. ఇద్దరం దిగాం. నేను కవాల్సిన రైతుకు మెస్సేజ్‌ పెట్టి, ఆమెతో బయలు దేరాను…
ఊరు దాటి, గుట్టల వైపు, అడవిలాంటి లాంటి ప్రదేశంలో, మలుపులు తిరిగిన, సన్నని కాలి బాటలో ఆమె వెనుకే నడుస్తున్నా. మధ్యాహ్నం 12 అవుతోంది… ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి..
తేమతో నిండిన గాలి బరువుగా వీస్తోంది…వర్షం ముందు వచ్చే మట్టివాసనేదో, వస్తోంది…
ఆ తరువాత ఏం జరిగిందో మీరే చదవండి…https://www.bbc.com/telugu/india-45238079

Share.

Leave A Reply