సామాన్యులకు అండగా నిలిచిన మనసున్న అధికారి…

Google+ Pinterest LinkedIn Tumblr +

సివిల్ సర్వీసు అధికారి , బిపి ఆచార్య IAS గారితో నాకు ఉన్న అనుబంధం మరపురానిది. ప్రజా సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు.. నాకు, ఎంతో మందికి స్ఫూర్తిని అందించింది. బిపి ఆచార్య గారి కృషి, పట్టుదల, అంకితభావం, కార్యదక్షతలను దగ్గరగా చూసి.. నేర్చుకున్న ఎన్నో విషయాలు నా జీవితానికి అన్వయించుకుంటున్నాను. తన దగ్గరకి సాయం కోసం వచ్చిన ఎవరినైనా ఆదుకోవాలని.. ఆయన పడ్డ తపన కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అందుకే ఆయన అంటే నాకు అపారమైన ప్రేమ, భక్తిలతో కూడిన అభిమానం. కుల, మత, ప్రాంతీయ అభిమానాలు లేకుండా..నీతి, నిజాయితీలతో సామాన్యులకు అండగా నిలిచి..ఆదుకునే గొప్ప మనసున్న అధికారి బిపి ఆచార్య గారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్ గా పదవీ విరమణ చేస్తున్న బిపి ఆచార్య గారు ఎన్నో ఉన్నత స్థాయి పదవుల్లో పనిచేసారు. 1983 లో సర్వీసులోకి వచ్చిన ఆయన భద్రాచలం సబ్ కలెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ తరువాత వరంగల్ కలెక్టర్‌గా, వివిధ శాఖల్లో కీలక పదవులతో పాటు.. 2017 నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిత్తశుద్దితో తన బాధ్యతలని నిర్వర్తించారు. వివిధ శాఖల్లో అనేక కొత్త ఆవిష్కరణలకు తెరతీసి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వ పర్యాటక శాఖకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చారు. ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది ప్రజల ఆదరాభిమానాలను పొందార

APIIC మేనేజింగ్ డైరెక్టర్ గా తెలుగు రాష్ట్రాల్లో శ్రీసిటీ, జీనోమ్ వ్యాలీ, Financial District, Mindspace IT Park, బ్రాండిక్స్, ఫార్మాసిటీ వంటి 20కి పైగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన IT Clusters, పారిశ్రామిక వాడల ఏర్పాటుకు గాను ఆచార్య ఎంతో కృషి చేసారు. ఆయన అందించిన సేవలు, కృషి ఫలితంగా 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. సివిల్ సర్వీస్ అధికారిగా 37 ఏళ్లకు పైగా అహరహం శ్రమించిన ఆచార్య గారు అందించిన విలువైన సేవలు, స్ఫూర్తివంతమైన పని తీరు ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయం.

బిపి ఆచార్య గారు ప్రభుత్వ అధికారిగా నేడు పదవీ విరమణ చేస్తున్నా.. ఆయన మస్తిష్కం నిరంతరం ఇతరులకు సాయం చేసేందుకు తపన పడుతూనే వుంటుంది. ఆచార్య గారిపై ఆ భగవంతుని అనుగ్రహం నిరంతరం ఉండాలని.. తన అనుభవాలు, ఆలోచనలతో మరెంతో మందిని ఆదుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

దొరస్వామి
భారతీయ భాగస్వామి, బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ,Visakhapatnam

Dora Swamy PC #BrandixIndia

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg42, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply