పాలు తాగని మానవులు

Google+ Pinterest LinkedIn Tumblr +

పాలు బలవర్థక ఆహారం అని ఓ విశ్వాసం. డాక్డర్లు కూడా తాగమనే చెబుతుంటారు. అందుకే పిల్లలకు పాలు తప్పనిసరిగా ఇస్తుంటాం. పిల్లలు మాత్రమేనా, పెద్దలు కూడా పాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక కాఫీలు, టీల కోసం పాల వాడకం సంగతి తెలిసిందే. ఇది నేరుగా పాలు తీసుకునే సంగతి. మరి పెరుగు, నెయ్యి, మీగడ, పాలకోవా, పాలక్‌ పన్నీర్‌ వంటి పాల పదార్ధాలు.. వాటితో తయారయ్యే అనేక రుచికరమైన మిఠాయిలు, వంటకాలకు అంతేలేదు.
ప్రపంచ వ్యాప్తంగా ఇదో భారీ పరిశ్రమ. ఐతే.. ఈ డైరీ పరిశ్రమ వెనుక అంతులేని జీవహింస, అనైతికత, అమానవీయత ఉన్నాయంటున్నారు కొందరు జంతు ప్రేమికులు. మనం సాధారణంగా దష్టి సారించని అనేక విషయాలను వెలుగులోకి తెస్తున్నారు.
పాలు అంటే బానిసత్వం 
” డైరీల్లోని పశువులు మనకు పాలివ్వడం కోసం వాటి సహజమైన స్వేచ్ఛను కోల్పోతున్నాయి. అవి జీవితాంతం ఓ ఇరుకు ప్రాంతంలో కట్టివేసి ఉంటున్నాయి. కనీసం అటూ ఇటూ తిరిగే అవకాశం కూడా చాలాచోట్ల ఉండదు. ఒక గంటసేపు క్లాసు రూములో కూర్చోవాలన్నా ఇబ్బంది పడుతుంటాం మనం. కానీ మన ఆరోగ్యం కోసం, పాలను ఇచ్చే పశువులు మాత్రం అదే గోడ, అదే తాడు, అదే షెడ్డు.. జీవితాంతం వాటి మధ్యనే బతుకుతున్నాయి. అందుకే పాలు అంటే బానిసత్వం.” అంటున్నారు అదిలాబాద్‌ జిల్లాకు చెందిన స్వచ్చంద సేవకుడు జాడవ్ రవీందర్‌. ఇతను గోండు ఆదివాసీల సుస్ధిర అభివృద్ది కోసం ఒక ఎన్జీఓ లో పనిచేస్తున్నారు.
మా పశువులను రేప్‌ చేయనివ్వం 

Athram Yathmabai

Athram Yathmabai

పెరుగుతున్న జనాభా.. పెరుగుతున్న పాల డిమాండ్‌ కారణంగా.. పాల ఉత్పత్తి కూడా అమాంతం పెంచాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. అందుకు సహజంగా జరగాల్సిన పశువుల సంతానోత్పత్తిని కత్రిమం, వేగవంతం చేసేశారు. అంటే మగ పశువుల వీర్యాన్ని సేకరించి దాన్ని బలవంతంగా ఆడ పశువుల గర్భాశయాల్లోకి చొప్పించి కత్రిమంగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ” ఒక బిడ్డను కనే సమయంలో నాలుగు బిడ్డలను కనేలా చేస్తున్నారు. ఇదే మనుషుల విషయంలో జరిగితే దాన్ని రేప్‌ అంటాం కదా. అంటే పాలు అంటే మానభంగం. ఇలాంటివి మా పశువులకు చేయనియ్యం”అంటారు ఇంద్రవెల్లి మండలం, వలుగొండ తండాకు చెందిన గేదం భీంరావు,కినక లక్ష్మణ్‌,మారుతి. వీరి ప్రాంతంలో ఎక్కడా పశువులకు కత్రిమ గర్భధారణ జరగ కుండా చూస్తున్నారు.
 కృత్రిమ  గర్భధారణ అంటే? 
” మేలుజాతి ఆబోతు లేక దున్నపోతు వీర్యాన్ని కృత్రిమంగా, పరికరాల ద్వారా సేకరించి, ఆవు లేదా గేదె ఎదకు వచ్చిన తర్వాత, ఆ వీర్యాన్ని అడపశువు గర్భకోశ ముఖద్వారంలో ప్రవేశింపచేస్తారు. ఆ తర్వాత పశువు చూడికట్టి సంతానోత్పత్తి చేస్తుంది. అలా అధిక పాల దిగుబదినిచ్చే మేలుజాతి పశోత్పత్తికి  కృత్రిమ గర్భధారణ పద్ధతిని అనుసరిస్తున్నాం.” అంటారు పశుసంవర్ధక శాక మాజీ అధికారి అహోబిలరావు.
మేలుజాతి పశువుల వీర్యాన్ని శీతలీకరణ పద్ధతిలో విల్వవుంచి, ఆబోతులు చనిపొయిన తర్వాత కూడా వాటి వీర్యాన్ని ఉపయోగిస్తున్నారు.
పాల వెనుక జీవహింస….? 

kinaka. laxman walgonda copy

kinaka. laxman walgonda copy

మరో దారుణమైన విషయం ఆవులకు కానీ, గేదెలకు గానీ మగ సంతానం పుడితే వాటికి భవిష్యత్‌ ఉండదు. ఎందుకంటే అవి పాలు ఇవ్వలేవు కదా. అందుకే వాటిని తల్లి నుంచి బలవంతంగా వేరు చేసేస్తారు. అవి ఆకలితోనైనా మరణిస్తాయి. లేదా కబేళాలకైనా తరలించేస్తారు. ఇదంతా పాల డిమాండ్‌ విపరీతంగా పెరగడం కారణంగానే జరుగుతుంది. ” పాలు అంటే శిశుహత్య అని మానమ్మకం. పశువులను పెంచుతాం కానీ, వాటి పాలను దూడలకే వదిలేస్తాం. ఎవరం తాగం, మా పిల్లలకు కూడా పట్టం. పాలు తాగడం పాపం అని మా నమ్మకం. పశువుల పేడను,మూత్రాన్ని పంటలకు ఎరువుగా వాడతాం. ” అంటోంది ఇంద్రవెల్లి గోండు మహిళ ఆత్రం యతనా బాయి. ఆదిలాబాద్‌,వరంగల్‌,అరకు ప్రాంతపు గిరిజనులను కలిసినపుడు, వారు పశు పోషణ చేస్తున్నారుకానీ, పాలను తాగడం లేదు. పాలను తాగడం వల్ల దూడలు ఆకలితో అలమటిస్తాయని వారి భావన. కొందరు వ్యవసాయం పనులకు పశువులను ఉపయోగిస్తున్నారు.
అంతులేని, అనైతికం 
”ప్రజల డిమాండ్‌కు తగినంత పాల ఉత్పత్తి పెంచడం కోసం ఎన్నో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అనేక నిషేధిత రసాయనాలు వాడుతున్నారు. యాంటి బయాటిక్స్‌, హార్మోన్‌ ఇంజక్షన్లు వాడుతుంటారు. వీటిలో ఆక్సిటోసిన్‌ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇది పశువులకు విపరీతమైన బాధ కలిగిస్తుంది. వాటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై దారుణమైన ప్రభావం చూపుతుంది. పశువుల జీవిత కాలం కూడా తగ్గిపోతుంది. త్వరగా జబ్బుల బారిన పడి నరకయాతన అనుభవిస్తాయి.” అంటున్నారు ఒక ప్రముఖ సామాజిక వేత్త.
మానవులకేనా హక్కులు.. 
డైరీల్లో పశువులు జీవితాంతం ఒకే చోట ఉండి.. స్వేచ్ఛ లేకుండా, నిరంతరం హింసకు గురై, బిడ్డలను కోల్పోయి, క ంగి క షించే పోయేది.. కేవలం మనకు ఇవ్వాల్సిన పాల కోసమే.అవి పాల ఉత్పత్తి చేయలేని రోజున వాటి కోసం కబేళాలు ఎదురుచూస్తుంటాయి. అందుకే పాలు అంటే హత్య. ఇన్ని దారుణాలలో వీటిలో ఏ ఒక్కటైనా మానవులకు జరిగితే ఊరుకుంటామా ? కనీసం ఊహించుకోండి. ఇంత జీవహింస జరిగేది కేవలం మనుషుల జిహ్వ చాపల్యం కోసమేనా.. పాల వెనుక ఇంత హింస జరుగుతుంటే పాలు ఎలా తాగుతున్నారు? ఒక్క సారి ఆలోచించండి. అంటున్నారు జంతు ప్రేమికులు.
పశు రక్షకుల వాదన అలా ఉంటే ,
” మేలుజాతి ఆబోతు, దున్నపోతు పోషణ చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి, కత్రిమ గర్భధారణ పద్ధతిని అవలంబిస్తే రైతుకు ఖర్చు తగ్గుతుంది. ఒక ప్రాంతంలోని మేలు జాతి పశు వీర్యాన్ని ఎన్నో వేల ఇతర పశువులను చూడి కట్టించటానికి ఉపయోగించవచ్చు. గర్భకోశ, పునరుత్పత్తికి సంబంధించిన వ్యాధులను అరికట్టవచ్చు ” అని పశువైద్యుల అంటున్నారు.
ఈ నూతన సంవత్సరంలో పాలకు వ్యతిరేకంగా పశు రక్షణ కోసం ఒక కొత్త ఉద్యమం రూపుదిద్దుకుంటున్నట్టు రూరల్‌ మీడియా పరిశీలనలో వెల్లడి అయింది.  ( inputs /ruralmedia team from Araku, Adilabad, title pic/k.Ramesh babu)

Share.

Leave A Reply