ఈ కల్లును చంటి బిడ్డలకు ఎందుకు పడతారు?

Google+ Pinterest LinkedIn Tumblr +

విశాఖ నుండి, 150 కిలో మీటర్లు దాటాక పార్వతీ పురంలో జట్టు ఆశ్రమం చేరుకునే సరికి 12 దాటింది. బాదం చెట్లకింద కొలనులో తెల్లని బాతులు బారులు తీరి మమ్మల్ని ఆహ్వానించాయి. మట్టిరంగు అంచు తెల్ల చీరలో, కాడమల్లె పూవులా నవ్వుతూ గిరిజన బిడ్డల మధ్య ఉన్న పద్మజ గారిని కలిశాం. సుఖమైన మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం వదిలేసి పేద చిన్నారులకు సేవచేయడానికి ఈ ఆశ్రమ బాధ్యత తీసుకున్న ఆమె ఇంటర్వ్యూ పూర్తియ్యే సరికి లంచ్ టైం దాటుతుంటే, మమ్మల్ని ఆపి మన్యంలో పండిన కాయగూరలు, గోంగూర, ఉసిరి పచ్చళ్లుతో భోజనం వడ్డించింది.అక్కడి నుండి తోటపల్లి బ్యారేజ్ వైపు బయలు దేరి మధ్యలో ఒక చిన్న పల్లెలో వీరు క్యాన్ల లో అరుదైన పానీయం తీసుకు వెల్తుంటే ఆగాం. దానిని చంటి బిడ్డలకు ఉగ్గుగిన్నెలో పడతారని వారు చెప్పారు…ఫాక్ట్ చెక్ కోసం సైంటిస్ట్ వెంగయ్య గారిని అడిగితే,వారు చెప్పింది ఈ వీడియో లో రికార్డ్ చేసాము. చూడండి!! https://youtu.be/XkDJLVAkH2k

Share.

Leave A Reply