ఆహారమే….ఔషధం…

Google+ Pinterest LinkedIn Tumblr +

నేటి సమాజంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు ఒకవైపు క్యాన్సర్ మరణాలు పెరిగిపోతున్నాయి మరోవైపు డయాబెటిక్, కీళ్ళవాతం, గుండె జబ్బులు ఇలాంటి సమస్యలు ప్రతి ఇంట్లో కనిపిస్తున్నాయి. హాస్పిటల్ చుట్టూ తిరగడం కంటే కూడా మంచి మందు మనం తీసుకునే ఆహారమే. ఈ విషయం మా మామగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు డాక్టర్లు చెప్పిన దానిని బట్టి నాకు అర్థమైంది. మా మామగారు స్వదేశీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితో మా వారు 2015 లోనే ఆర్గానిక్ వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. అయితే పూర్తి అవగాహన తో 2018 నుంచి మేం సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము. అందుకు కారణం మా మామయ్య అనారోగ్యం. ఆయనకి లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు క్యాన్సర్ బయటపడింది. చికిత్సకోసం హాస్పిటల్ కి ఆయనతో పాటు నేను మా వారు తిరిగాము. అక్కడ చూసిన హృదయవిదారకమైన దృశ్యాలు మమ్మల్ని కలచివేశాయి. చిన్న చిన్న పిల్లలు.. వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్తో పోరాడుతున్నారు.

అందుకు కారణం ఏమిటి అని డాక్టర్లను అడిగితే వాళ్లు చెప్పిన మాట క్యాన్సర్ రావడానికి మనం తీసుకునే ఆహారమే ఎక్కువ కారణమవుతుంది. క్యాన్సర్ను నివారించే బ్లాక్ రైస్ గురించి తెలుసుకుని దానిని పండించే ప్రయత్నం చేసి చేశాం. సిద్దిపేట జిల్లా లింగాపూర్ గ్రామంలో లో మూడు ఎకరాల పొలంలో 51 రకాల వరి వంగడాలను పండిస్తున్న నూటికి నూరు శాతం ఆరు సేంద్రియ విధానంలో పాలేకర్ వ్యవసాయ విధానంలో మేము సాగు చేస్తున్నాం. ఆ తర్వాత కొద్ది రోజులకి మామగారు చనిపోయారు ఆయన మరణం మాకు కొత్త దారి చూపించింది. కేవలం క్యాన్సర్ ఒకటే కాదు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మూల కారణం ఆహారమే. రసాయనాలతో పండించిన ఆహారం తీసుకోవడం వలన ఆ సమయానికి ఆకలి తీరుతుందేమో కానీ శరీరంలో అనారోగ్యం పెరుగుతుంది. ఈ విషయం మనసును హత్తుకుపోయింది. మన పూర్వీకులు ఏం తినేవారు ఎలాంటి వంగడాలను వాళ్ళు సాగు చేసే వాళ్ళు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేశాం. గ్రామ గ్రామాలు తిరిగి పురాతన స్వదేశీయ వరి వంగడాలను సేకరించడం మొదలు పెట్టాం. అలా దాదాపు 51 రకాల వరి వంగడాలను సేకరించి వాటిని మా పొలంలోనే సాగుచేసి ఈ విత్తనాలను ఉచితంగా ఇతర రైతులకు పంపిణీ చేశాం.ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో 50 మంది రైతులు మమ్మల్ని అనుసరించి సాగు చేస్తున్నారు.

vishal reddy

కనుమరుగైపోయిన ప్రకృతి వ్యవసాయం మనతోపాటు జీవరాసులని, పర్యావరణాన్ని రక్షిస్తుంది. అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. రసాయనాలు వాడడం వల్ల భూసారం తగ్గిపోవడమే కాకుండా ప్రకృతిసిద్ధంగా పంటను రక్షించే అనేక పశుపక్ష్యా దులు చనిపోతాయి. మా జిల్లాలో నూటికి నూరు శాతం రైతులను సేంద్రియ విధానం వైపు మళ్ళించాలని మా లక్ష్యం.

– జక్కుల రేణుక తిరుపతి,
లింగాపూర్ గ్రామం, సిద్దిపేట జిల్లా

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg42, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply