నీటిబొట్టు చుట్టూ అభివృద్ధి …

Google+ Pinterest LinkedIn Tumblr +

‘భూమి మీద 70శాతం నీరున్నా అందులో తాగడానికి పనికొచ్చేది 3శాతమే. 800 కోట్ల ప్రపంచ జనాభాలో కోటి మందికి నీరు అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా 400 నగరాలు నీటిసంక్షోభానికి దగ్గరలో ఉన్నాయి…’ ఇదంతా చదివి,
ఎక్కడో నీరు లేక పోతే మనకేందీ… అనుకోలేదీ కన్నాల ప్రజలు. అక్కడ పరిస్దితిని ఒక హెచ్చరికగా తీసుకున్నారు. ప్రతీ ఒక్కరు చేయి,చేయి కలిపి , ఊరి మధ్యలో ఉన్న గుట్టల చుట్టూ కందకాలు తవ్వి వాననీటిని ఆపారు.
సీన్‌ కట్‌ చేస్తే ,
పాతాళంలో ఉన్న నీరు ఇలా, పైకొచ్చింది. మాలాంటి బాటసారుల దాహం తీరుస్తోంది. రెండుపంటలు వరి,మరో పంట కూరగాయలు పండిస్తున్నారు. నీటిబొట్టు చుట్టూ అభివృద్ధి అల్లుకుంది.@Peddapalli/dry land agri/ruralmedia

Share.

Leave A Reply