ప్రతి బొట్టు … అభివృద్ధికి మెట్టు

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రతి బొట్టు … అభివృద్ధికి మెట్టు

”ఇంద్రవెల్లి వాటర్‌షెడ్‌ విస్తీర్ణం మొత్తం 657 హెక్టార్లు. మా గ్రామం కూడా ఇంద్రవెల్లి వాటర్‌షెడ్‌ పరిధిలోకే వస్తుంది. 2008లో వాటర్‌షెడ్‌ పనులు మొదలయ్యాయి. అప్పటినుంచి మా బావుల్లో నీటిమట్టం కూడా బాగా పెరిగింది. దాంతో మా గ్రామంలో గిరిజనుల జీవనవిధానంకూడా మారింది. మొట్టమొదట అడవిలో వున్న చెట్లను నరకడం మానుకున్నాం. అడవిని నరికితే బ్రతుకే వుండదనే విషయం మాకు అర్థమైంది. ఏకలవ్య ఫౌండేషన్‌ వారు ఎక్కడినుంచో వచ్చి మా బంజరు నేలను అభివద్ధి చేస్తుంటే, అడవితల్లి ఒడిలో పుట్టిన మేము అడవిని నాశనం చేయడం మంచిదికాదన్న భావన మాలో కలిగింది. పిల్లలను చదివించాలన్న పట్టుదల మాలో పెరిగింది. శుభ్రత పట్ల అవగాహన కలిగింది. చాలా మంది ఆరు బయటకు వెళ్ళకుండా మరుగుదొడ్లను ఉపయోగించడం మొదలు పెట్టాము. మా తాండాలో దాదాపు అన్ని ఇళ్ళకూ మరుగుదొడ్లు వున్నాయి.
నీరు వున్న చోట అభివద్ధి జరుగుతుందంటారు. వాటర్‌షెడ్‌ వల్ల మాకు నీరు వచ్చింది.. అన్ని రకాల పంటలను పండిస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నాం.” అని సంతోషంగా చెప్పారు బహద్దూర్‌ సింగ్‌.
ఇంద్రవెల్లి చుట్టూ చిన్నాపెద్దా కొండలున్నాయి. వానాకాలంలో అక్కడి నుంచి వచ్చే నీటితోనే వ్యవసాయం చేసేవారు గిరిజనులు. అయితే.. ఒక్కసారిగా పారే నీటికి ఎక్కడా అడ్డుకట్టలు లేకపోవడంతో నీరంతా వృధాగా పోయేది. రాతికట్టలు, ఫారంపాండ్స్‌, పొలం చుట్టూ కందకాలు తవ్వడం, చెక్‌డ్యామ్‌ల ద్వారా ఆ జలాన్ని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని ‘ఏకలవ్య ఫౌండేషన్‌’ చెప్పడంతో తక్కువ ఖర్చుతో నిర్మించే ఈ పనులవల్ల ఎగువ నుంచి వచ్చే వాననీటిని తమ ప్రాంతంలోనే ఇంకిపోయేలా చేశారు.

Pic/k.rameshbabu/ruralmedia/wsd

Share.

Leave A Reply