బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ !!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. ఎన్నో ప్రాంతాల్లో తాగేందుకూ నీళ్లు లేక ప్రజలు కటకటలాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ సహా దేశవ్యాప్తంగా సుమారు 256 జిల్లాల్లోని ప్రజలు తీవ్ర నీటిఎద్దడి బారినపడ్డారని ఒక అంచనా.
హైదరాబాద్‌ , బెంగళూరు, చెన్నై, సహా 21 ప్రధాన నగరాల్లో 2020 నాటికల్లా భూగర్భజలాలు సున్నా స్థాయికి చేరుకుంటాయని గతేడాది విడుదలయిన, నీతిఆయోగ్‌ నివేదిక హెచ్చరిస్తోంది.


2030 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల లభ్యతతో పోలిస్తే ఇప్పుడున్న అవసరాలు రెండింతలు పెరుగుతాయన్నది, మరొక అంచనా. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా నీటి వనరులు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా వాననీటి సంరక్షణకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. నీటి కొరత వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా, ఇతర రంగాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. నీటి సమస్య తీవ్రరూపం దాల్చేకొద్దీ అమ్మాయిన విద్యపై ప్రభావం పడుతుందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తీకరిస్తున్నారు. బాలికలు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో బడి మానేసే ప్రమాదం ఉంది.

ఇలాంటి నేపథ్యంలో,
గత వారం చాలా చోట్ల వానలు పడి, ప్రాజెక్టులు నిండాయి కానీ, చిత్తూరు జిల్లాలో చినుకులే లేవు. కానీ రామకుప్పం రైతులకు భవిష్యత్‌ చిత్రపటం తెలుసుకాబట్టి, నీటి నిల్వకు త్రిసూత్రాలు పాటించారు.
ఏడాది క్రితమే కురిసిన వాన నీళ్లను సరైన దిశలో నడిపి, నడిచే నీళ్లను సరైన స్థలంలో ఆపి, ఆగిన నీళ్లను పూర్తిగా భూమిలో ఇంకించారు. వారి కష్టం ఫలించకుండా ఎలా ఉంటుంది ? రాయల సీమలో బావిలో నీరు చేతికందేలా ఉందంటే ఇదొక బ్రేకింగ్‌ న్యూస్‌ కాదా!

Share.

Leave A Reply