రెక్క విప్పిన చైతన్యం

Google+ Pinterest LinkedIn Tumblr +

రెక్క విప్పిన చైతన్యం
మారు మూల గ్రామంలో ఓ నిండు గర్భిణి సమయానికి వైద్య సేవ అందకపోవడంతో మరణించింది. ఆమె మరణం జిల్లా కలెక్టర్‌ని కదిలించింది. సరైన సమయానికి ఏఎన్‌ఎం సేవలు ఆమెకు అందినట్టయితే ఆమె జీవితం నిలబడేది.
అయితే ఏఎన్‌ఎం లకు గ్రామాలకు వెళ్ళి వైద్య సేవలు అందించడానికి వాహన సదుపాయం లేని పరిస్థితి. రహదారులు వున్న గ్రామాలతోపాటు, రహదారులు లేని గ్రామాలకు వెళ్ళాలన్నా ఏఎన్‌ఎం  ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎం కార్యకర్తలు ఐదు వేల మందికి వైద్య సేవలు అందించాలి. ప్రతిరోజూ పదిహేను కిలోమీటర్లకు పైగా పర్యటించాలి. దీని కోసం వీరు బస్సులు లేదా షేర్‌ ఆటోల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఏఎన్‌ఎం కార్యకర్తలకు సరైన వాహన సదుపాయం లేకపోవడం వల్ల గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సదుపాయాలు అందడం లేదని వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ గ్రహించారు. ఈ సమస్యకు ఆమె చక్కని పరిష్కార మార్గాన్ని కనుక్కొన్నారు. దాని పేరు
”ప్రాజెక్టు రెక్కలు”.
ఏఎన్‌ఎంలకు వాహనాలు సమకూర్చి, వైద్య సేవలను గ్రామీణులకు చేరువ చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ‘ప్రాజెక్టు రెక్కలు’ పథకంలో భాగంగా మొదట మోటర్‌ సైకిల్‌ నడపటం వచ్చిన పదిమందికి వాహనాలు అందించారు. వారు గ్రామాల్లో దూసుకు పోతూ సకాలంలో వైద్యం అందిస్తున్నారు.ఫలితాలు బాగుండటంతో క్రమంగా జిల్లాలోని ఏఎన్‌ఎంలందరికీ వాహనాలిచ్చారు… ” మాకు వాహనాలు ఇవ్వడం వల్ల ఇంతకు ముందుకంటే ఎక్కువ గ్రామాలు తిరుగుతున్నాం. సకాలంలో వైద్యసేవలు అందిస్తున్నాం” అని శివారెడ్డి పేట ఆరోగ్యకేంద్రం లో పనిచేస్తున్న ఏఎన్‌ఎం షబానా రూరల్‌మీడియా తో సంతోషంగా చెప్పారు .

Share.

Leave A Reply