పాత పంటల జాతరలో ఉపాసన కొణిదల!!

Google+ Pinterest LinkedIn Tumblr +


ప్రజల్లో చిరుధాన్యాలపై అవగాహన కల్పించేందుకు సంవత్సరానికి ఒకసారి డెక్కన్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) నెల రోజులు పాతపంటల జాతర నిర్వహిస్తున్నారు. సంక్రాంతి నుంచి నిర్వహిస్తూ ఈనెల 15వ తేదీన ముగిసిన 21వ పాత పంటల జాతరలో బహుజన మహిళా రైతులు తాము పండించిన పంటలను ప్రదర్శించి, సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత, మిశ్రమ పంటల సాగుపై ప్రజలకు అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లా, మాచునూరు గ్రామం, జరాసంగం మండలంలో ఈ సారి నిర్విహించిన జాతరలో స్ధానిక గ్రామాల నుండి ఎడ్లబండ్ల పై తాము పండించిన చిరుధాన్యాలను తీసుకొని రైతులు ఉత్సాహంగా తరలి వచ్చారు. ఈ పంటల పండుగలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు,ఎన్జీఓలు పాల్గొన్నారు.
చిరుధాన్యాల విలువేంటో తెలిసింది!!
………………………………………………
” మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొర్రల పాయసం, పచ్చజొన్నల గటక, రాగి జావ లాంటి పేర్లు ఈ జాతరలో వింటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు సార్థకత చేకూరుతోంది. ఒకప్పటి పచ్చ జొన్నల గట్క , రాగిజావ తిరిగి కళ్లముందుంచారు ఇక్కడి రైతమ్మలు.వీరి మధ్య గడపడం చాలా హ్యాపీగా ఉంది.”అని ఈ జాతరకు వచ్చిన ఆపోలో గ్రూప్‌ ఛైర్‌ పర్సన్‌ ఉపాసన కామినేని కొణిదల అన్నారు. జాతర ఆవరణలో డిడిఎస్‌ మహిళలు నిర్వహిస్తున్న సంగం రేడియో కేంద్రం, విత్తన బ్యాంక్‌ను ఉపాసన ఆసక్తిగా పరిశీలించారు. చిరుధాన్యాలతో చేసిన వంటలను రుచి చూసి, వాటిని చేసిన మహిళలను అభినందించారు.
………………….

అరుదైన జాతర!!
ఈ కార్యక్రమంలో మరో అతిధి, వి.సునీతా లక్ష్మారెడ్డి (ఛైర్‌ పర్సన్‌, తెలంగాణ స్టేట్‌ కమిషనర్‌ ఫర్‌ వుమెన్‌) పాల్డొని ప్రతీ స్టాల్‌ని సందర్శించి. అక్కడున్న విత్తనాలు, ఔషదమూలికలు, మట్టి నమూనాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
” ఇలాంటి జాతర వల్ల అన్ని రకాల పంటలను,వాటిని పండించిన రైతులతో ముచ్చటించే అవకాశం కలిగింది. సన్నబియ్యం, బాసమతి రైస్‌ తినడమే స్టేటస్‌ అనుకునే రోజులు పోయి, ప్రాభవం కోల్పోయిన చిరుధాన్యాల రోజులు వచ్చాయి. రసాయన రహిత సాగుకు అంతులేని ప్రోత్సాహం ఇస్తున్న డిడిఎస్‌ డైరెక్టర్‌ సతీష్‌ గారికి అభినందలు..” అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
జాతరలో పాల్గొన్న శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ” పాతపంటల జాతర సంప్రదాయాన్ని21 ఏండ్లుగా కొనసాగించడం అపూర్వం.డిడిఎస్‌ మహిళా రైతులను సేంద్రియ పంటల సాగు కు ప్రోత్సహించడం వల్ల , నేల ప్రకృతిసాగుకు అనువుగా మారి ,రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందుతుంది.” అన్నారు.
జీవవైవిధ్య పండుగ!!
………………………….
జహీరాబాద్‌ సమీపంలో మూచునూరులో జరిగిన ఈ జీవ వైవిధ్యజాతరలో
కనుమరుగైన సామల రొట్టెలను. మచ్చుకైనా కనిపించని సజ్జ మలీదలు , ఈ తరానికే తెలియని నూనె పోలెలు అందరినీ ఆకట్టుకున్నాయి.
జహీరాబాద్‌, కొహిర్‌, ఝరాసంగం, రాయికోడ్‌, న్యాలకల్‌, మొగ్దంపల్లి నుండి వచ్చిన రైతులను పలకరిస్తే, సమ్మర్‌లో సామబియ్యం తిని, రాగి అంబలి తాగితే, చలువ అని, చలికాలం కొర్ర బువ్వ తినాలని,
పచ్చ జ్జొన్న రొట్టె, కొర్రబియ్యం తింటే షుగర్‌, బీపీ కంట్రోల్‌ అవుతుందనే చైతన్యం కలిగిస్తారు. నల్లవడ బియ్యం తింటే, రోగాలు రావని లక్ష్మమ్మ అనే రైతు చెప్తుంటే ఇంతకాలం మనం తిన్న చెత్తేంటో తెలుస్తుంది.
………………Team, ruralmedia

 Rural Media తీసిన మరి కొన్ని వినూత్న వీడియోలు చూడండి.

1, The purpose of check dam is to retain water up stream, so that the water percolates into the ground and recharges the ground water table. Check Dams built on seasonal rivers hurdles the wastage of rain water discharging into the sea and provides fresh water bodies for local use as well as strengthens the ecosystem…https://youtu.be/TWMDjXeLHII

2, రెక్కాడితే కానీ,డొక్కాడని కుటుంబం నుండి వచ్చిన సత్తి రెడ్డి 11 ఏళ్ల వయసులో, పాలికాపుగా, నెలకు 15 రూపాయల జీతానికి పనిచేశాడు, కష్టాల బాట లో ఒక్కో మెట్టు ఎక్కుతూ  నేడు వంద ఎకరాల రైతుగా ఎలా మారాడు? 18 రకాల ప్రకృతి పంటలు, ఎలా పండిస్తున్నాడు? గోదావరి జిల్లాలను సస్య శ్యామలం చేసిన కాటన్‌ దొర కోసం ఏమి చేసాడు? సాగులో సంపాదించిన ఆదాయం సమాజ సేవకు ఎలా ఖర్చు చేస్తున్నాడు? రండి ,ఆ ఆదర్శ మానవుడిని పలకరిద్దామా… …
https://youtu.be/zRQBXrXjLSs

3, కొండల మీది గంగను కిందికి దించి, ఆ నీటి తో పెరిగిన ఈ పండ్ల చెట్ల ఆకుల నుండి , కొవ్వును కరిగించే అరుదైన పానీయం ఎలా చేస్తున్నారో చూడండి… https://youtu.be/A1TX_UC4RssShare.

Leave A Reply