విజయనగరం నుండి 12 కిలో మీటర్లు దాటితే, నెల్లిమర్ల అవతల ఈ సుందర ప్రదేశం మమ్మల్ని ఆపేసింది. చెరువు మధ్యలో బావి, ఎదురుగా బోర్లించిన గిన్నెలాంటి కొండను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఈ ప్రాంతపు ప్రజలు ఈ కొండలో గంధకం ఉందని నమ్ముతారు , అందుకే ‘ గంధకపు కొండ ‘ అని మాకు పరిచయం చేశారు.
దశాబ్దాల క్రితం పురాతన సీతారాముల విగ్రహాలు ఈ చెరువు అడుగున దొరకడంతో ఈ ప్రాంతం ‘రామతీర్థం’గా మారి, ఆధ్యాత్మిక కేంద్రంగా అయింది. ఈ కొండ మీద గడ్డికూడా మొలవక పోవచ్చు కానీ, ఈ కొండ లేక పోతే ఇక్కడి రైతులకు మనుగడ లేదు. తాగునీటికి,సాగునీటికి ఈ కొండే ఆధారం. అదెలా అంటారా? ఈ కొండమీద పడిన ప్రతీ వాన చినుకు ఈ చెరువులోకి చేరి ఊర్లోని బావులు,బోర్లు నిండాయి. దాదాపు 30 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు లోని ఒండ్రు మట్టిని రైతులు పొలాల్లో చల్లి. భూసారం పెంచారు.
” ఈ సారి వానలు బాగా పడటం వల్ల చెరువు నిండి 250 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మినుములు, పెసలు, కూరగాయలు దిగుబడి పెరిగింది. చెరువులో చేపల పెంపకం వల్ల జాలరులకు బతుకు తెరువు దొరికింది ..” అని ఇక్కడి రైతులు కూల్ గా చెప్పారు.( జనం సెంటిమెంట్లను రెచ్చ గొట్టే కథనాలు కాకుండా, ఈ ప్రాంతపు ప్రజల శ్రమను గౌరవించి, అభివృద్ధిని ఫోకస్ చేసే కథనాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తాయని ఆశిస్తున్నాం!!)
అరుదైన గ్రామీణ విజయ గాథలు, పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia తెలుగు ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .