భవిష్యత్ అవసరాలను ఊహించి, దానికి తగిన నిర్ణయాలు తీసుకునే వారు అరుదుగా ఉంటారు.
ఈ రోజు జీనోమ్ వ్యాలీతో ఓ వెలుగు వెలుగు తున్న హైదరాబాద్ వైపు నేడు యావత్ ప్రపంచం చూడబోతుంది. కరోనాపై సమరం చేస్తున్న భారతావనికి తొలి స్వదేశీ టీకాను అందించిన బంగారు
తెలంగాణ పేరు చరిత్ర పుటలకు ఎక్కనుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన కొవాగ్జిన్‌కు లైన్ క్లియర్ అయింది.
అయితే, ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌కు కేంద్రమైన జీనోమ్ వ్యాలీ ఏర్పాటులో నిరంతరం శ్రమించిన ఒక గొప్ప వ్యక్తిని మనం మరిచిపోతున్నాం. ఆయన్ని కొందరు గుర్తించక పోవచ్చు, చాలామంది కావాలని పట్టించుకోక పోవచ్చు. కానీ,
‘ఉద్యోగ బాధ్యతను నిజాయితీగా నెరవేర్చిన నాకు భుజకీర్తులు ఎందుకులే …’ అనుకుంటూ మహేంద్రా హిల్స్‌లో బుద్ధుని చెంత తల వంచుకొని ధ్యానంలో గడుపుతున్న ఆ భవిష్యత్ చిత్రకారుడిని పలక రిస్తారా?… https://ruralmedia.in/modi-visits-bharat-biotech-in-hyderabad/