వెలుగులు చిమ్మే విద్యుత్‌కాంతి కెరటాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

” ఈ ఏలేరు కాల్వలో, బట్టలుతుక్కోవడం, సేపల ఏట, ఇంత వరకు చేశామండీ, ఇపుడు ఈ నీళ్లలోంచే కరెంట్‌ తీసి మా గుడెసెలో బల్బులు ఎలిగిత్తున్నాం. రండి బాబూ , సూపిత్తాం….?” అని బట్టలు ఉతకడ ఆపి, ఆమె తమ గూడేనికి తీసుకెళ్లింది…ఆ తరువాత కథను మీకు చెప్పాలంటే పదేళ్లు వెనక్కి వెళ్లాలి…
పెద్దగా చదువూ సంధ్యాలేని ఆడవాళ్లు, 
మారుమూల గ్రామాల్లో పనులు చేసుకు బతికే పేదవాళ్లు, 
రెక్కాడితేకానీ డొక్కాడని అతిసాధారణ గ్రామీణులు, 
నిరంతరం బతుకు పోరాటంలో నలిగిపోతున్న స్త్రీలు…. 
పని,చాకిరి,కాయకష్టం, చెమటచిందితేనే పొయ్యిమీద అన్నం వుడికేది.ఇలాంటి అట్టడుగున వున్న, ఎవరికీ పట్టని, ఎందుకూ కొరగానీ ఆదీవాసీలు కూడా ఒక అద్భుతం సృష్టించగలరంటే మీరు నమ్మగలరా?వాళ్లుసాధించింది మామూలు విజయం కాదు. ఏకంగా ఒక జలవిద్యుత్‌కేంద్రమే కట్టారు. వృధాగాపోతున్న ఏలేరు నీటిని వెలుగులు చిమ్మే విద్యుత్‌కాంతి కెరటాలుగా మార్చి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారు.ఆ ఆదివాసీ మహిళలకు అండగా,చేదోడు వాదోడుగా నిలిచింది రాష్ట్రప్రభుత్వం.ఆర్థికంగా ఆదుకుంది నాబార్డు. 
పనినేర్పించి,శిక్షణ యిప్పించారు. అమాయకమైన ఆదీవాసీ అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ‘పారిశ్రామికులు’గా తయారు చేసింది.ప్రభుత్వం తల్చుకుంటే ఎంత గొప్పపనులు చేయగలదో, ఎంతమంది భవిష్యత్‌కు పూలదారులు వేయగలదో చేసిచూపించిన గొప్ప కృషి యిది. అనామకులైన ఆడవాళ్లని పారిశ్రామికులుగా మార్చిన నిజమైన అనుభవం యిది . అతి త్వరలో సమగ్ర కథనం అందిస్తాం… 
(రంపచోడవరం ఏజెన్సీ నుండి… శ్మాంమోహన్‌ )

Share.

Leave A Reply