ఏపీలో ‘మన్యం’ జిల్లా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆదివాసీలకు ప్రత్యేకంగా గిరిజన జిల్లా ఏర్పాటు అయినపుడే వారి సమస్యలు తీరతాయని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ ఉన్నపుడే అనేక ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తుండేవి. 
ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు ఎలా అన్నదానిపై అనేక సార్లు తర్జనభర్జనలు జరిగినప్పటికీ ఒక కొలిక్కి రాలేదు.
ఇపుడు తాజాగా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాబోతున్న సందర్బంలో జిల్లాల పునర్వస్తీకరణ నేపథ్యంలో గిరిజన జిల్లా ఏర్పాటు తెరమీదకు వచ్చింది. అరకు నుండి రంపచోడవరం గిరిజన ప్రాంతాల్లో వైసీపీకి బంపర్‌ మెజారిటీ రావడంతో గిరిసీమలన్నీ కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటుకు జగన్‌ సానుకూలంగా ఉన్నారని తెలిసింది. 
గిరిజన జిల్లా కేంద్రం ప్రజలకు మరీ దూరంగా ఉండకూడదని, వారికి అన్ని సేవలు సులువుగా లభించేలా చూడాలని అధికారవర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వైసీపీకి ప్రజలు అఖండ విజయం కట్టబెట్టారు. మన్యంలో వైసీపీ హవా కొనసాగింది. ఈ నేపథ్యంలో గిరిజన జిల్లా ఏర్పాటుపై పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు. 
విశాఖ నుంచి విడదీసే అరకునే గిరిజన జిల్లాగా ప్రకటించాలా? లేక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య ఉన్న ఏజెన్సీ ప్రాంతంతో పార్వతీపురం కేంద్రంగా జిల్లాగా ప్రకటించాలా అన్నదానిపై సమాలోచనలు జరుగుతున్నాయి. 
విశాఖ మన్యంలో అరకును జిల్లా చేసి… శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలోని ఏజెన్సీలోనే కొత్తజిల్లా ఉండటం ఖాయమని అనధికార వర్గాల సమాచారం. 

Share.

Leave A Reply