శ్రీసిటీలో గోవింద ఫుడ్స్ …

Google+ Pinterest LinkedIn Tumblr +

టచ్‌స్టోన్ ఫౌండేషన్ చే శ్రీసిటీలో గోవింద ఫుడ్స్ ప్రారంభం- సరసమైన ధరల్లో కార్పొరేట్ సంస్థలకు  రుచికరమైన, నాణ్యమైన ఆహారం సరఫరా
బెంగుళూరులోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) అనుబంధ స్వతంత్ర సేవాసంస్థ టచ్ స్టోన్ ఫౌండేషన్, శ్రీసిటీలోని కార్పొరేట్ సంస్థలకు ప్రతిరోజూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం సరఫరా చేసేందుకు  గోవిందా ఫుడ్స్  పేరుతో వంటశాలను సోమవారం (జూన్ 17, 2020 ) శ్రీసిటీలో ప్రారంభించింది.  అధునాతన వసతులతో ఈ కిచెన్ పనిచేయనుంది. ఇస్కాన్ యొక్క స్వచ్ఛంద కార్యక్రమాలను కొనసాగించడానికి అవసరమైన నిధులను సమకూర్చే వివిధ వెంచర్లను టచ్ స్టోన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాంటి వెంచర్లలో శ్రీసిటీలోని గోవింద ఫుడ్స్ ఒకటి. టచ్‌స్టోన్ ఫౌండేషన్ సీఈఓ కౌంతేయ దాసాజీ, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సమక్షంలో శ్రీసిటీ డీఎస్పీ విమలకుమారి లాంఛనంగా దీనిని ప్రారంభించారు. వివిధ పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా  కౌంతేయ దాసాజీ గోవింద ఫుడ్స్ విశిష్ఠతను, వంటశాల ప్రత్యేకతలను వివరించారు. ఈ వంటశాల ద్వారా ఆర్జించే లాభాలను ఇస్కాన్ సంస్థకు చెందిన లాభాపేక్షలేని మరో అనుబంధ సంస్థ అక్షయ పాత్ర నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా పథకాలకు వినియోగించనున్నట్లు తెలిపారు. 

శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలకే కాకుండా, శ్రీసిటీ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలకు కూడా సరసమైన ధరలతో పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలన్నది తమ చిరకాల కోరిక అన్నారు. గోవింద ఫుడ్స్  ఉనికిిితో ఏ ఒక్కరూ  ఇక్కడ ఆకలితో ఉండరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గోవింద ఫుడ్స్ వారి సేవలను ఉపయోగించుకోవాలని పరిశ్రమల ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో మంచి డిమాండ్ ఉన్నందున, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
అక్షయ పత్ర మాదిరిగానే, గోవిందా ఫుడ్స్ వంటశాలలో కూడా  ట్రాలీలు, రైస్ చూట్స్, పప్పు / సాంబార్ ట్యాంకులు, కట్టింగ్ బోర్డులు, ఇతర వంట పరికరాలు ఉన్నాయి. ఈ సెమీ ఆటోమేటెడ్ కిచెన్ లో రోజుకు 10 వేల మందికి అవసరమైన ఆహార తయారీ సామర్థ్యం ఉంది. సురక్షితమైన వాతావరణంలో అల్పాహారం, భోజనం తయారీతో పాటు వంట చేసిన తరువాత, ఆహారాన్ని స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలలో ఉంచి, ప్రత్యేక ఆహార రవాణాా వాహనాల్లో  పారిశ్రామిక యూనిట్లకు సరఫరా చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  (D. Ravi )

Share.

Leave A Reply