ఏకమైన ఆన్‌లైన్‌ మీడియా

Google+ Pinterest LinkedIn Tumblr +

        కేసీఆర్‌ని కలువ నున్న జర్నలిస్టులు  

        పోరు బాటలో ఆన్‌లైన్‌ మీడియా
        తెలంగాణ ఆన్‌లైన్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆవిర్బావం
హైదరాబాద్‌: (రూరల్‌మీడియా ప్రతినిధి) ఆన్‌లైన్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆన్‌లైన్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. నేడు సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆన్‌లైన్‌ మీడియా జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (తోజు) మరియు తెలంగాణ మీడియా జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (తోమ్జ)విలీనమై తెలంగాణ ఆన్‌లైన్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ (తొమ్వాజ) గా ఆవిర్భవించింది.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంది. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆయిలు రమేష్‌ మాట్లాడుతూ, ప్రింట్‌ , ఎలక్ట్రానిక్‌ మీడియా కంటే అత్యంత వేగంగా సమాచారాన్ని చేరవేస్తూ సామాన్య ప్రజలకు చేరువవుతున్న ఆన్‌లైన్‌ మీడియాకు తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఇతర మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇస్తున్నట్లు గానే ఆన్‌లైన్‌ మీడియా జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులను ఇవ్వాలని అన్నారు. దీనికి తగిన గైడ్‌ లైన్స్‌ను రూపొందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

Telangana Online Media Working Journalists Association

Telangana Online Media Working Journalists Association

యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ ధర్మాసనం మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌ రావును కలిసి ఆన్‌లైన్‌ మీడియా జర్నలిస్టులకు గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ సరైన స్పందన లేదని ఆయన వివరించారు. మరొకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఈమేరకు విజ్ఞ్యప్తి చేస్తామని అప్పటికి కాని పక్షంలో పోరుబాట పడతామని అన్నారు. గతంలో ఇచ్చిన అక్రిడిటేషన్‌ కార్డులను ఎందుకు ఆపివేసారని అధికారులని అడిగితే అసంబద్ద కారణాలు చూపుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆన్‌ లైన్‌ మీడియాను గుర్తిస్తూ గైడ్‌ లైన్స్‌ ను రూపొందించిందని శ్రీధర్‌ చెప్పారు.
గత సంవత్సరం ఈ గైడ్‌ లైన్స్‌ ప్రకారం అక్రిడిటేషన్స్‌ ఇచ్చిన ప్రభుత్వం ఈ సారి ఇవ్వక పోవడం శోచనీయం అని ఆయన అన్నారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు కాసుల ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ చాలామంది ప్రభుత్వ అధికారులు ఆన్‌లైన్‌ మీడియాని సోషల్‌ మీడియాగా భావిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని. ఆన్‌ లైన్‌ మీడియా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా తరువాత మూడవ మాధ్యమంగా నేడు ఆవితరించిందని తెలిపారు. గతంలో ఇచ్చిన అక్రిడిటేషన్‌ కార్డులను ఈ సంవత్సరం రద్దు చేయడం వెనకాల ఎదో రాజకీయ కుట్ర ఉందని దీని పై పోరాడి మా హక్కులు సాధిస్తామని అన్నారు.
నూతన కమిటీ
(వైస్‌ ప్రెసిడెంట్స్‌) మదిశెట్టి రాజగోపాల్‌,ఎ రాజేష్‌, సూర్య రావ్‌, ఎం ఎస్‌ శంకర్‌, అమర్‌ రాజ్పుటే, కే. శ్రీకాంత్‌ రెడ్డి (జాయింట్‌ సెక్రటరీలు) కళ్యాణం శ్రీనివాస్‌, కే.హనుమంతరావు,శ్యాంమోహన్‌, ముద్దం నరసింహ స్వామి, రాజ్కుమార్‌ అల్లా, ప్రభు దాస్‌, (కోశాధికారి) వేముల సదానందం మరియు కార్యవర్గ సభ్యులు కే ఎల్‌ నరసింహ రావు, ఎస్‌ శంకర్‌ గౌడ్‌, శైలజ రాజ్పుటే, డి సింధూర, కే. సంతోష్‌ కుమార్‌, ఫణి ముళ్ళపూడి, రామ్‌ మూర్తి తదితర జర్నలిస్టులు ప్రెస్‌క్లబ్‌కి హాజరై తమ సమస్యలు పంచుకున్నారు.

Share.

Leave A Reply