సంగారెడ్డి జిల్లా బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి బయటకు వస్తుంటే, నలిగిన ఆధార్ కార్డులు పట్టుకొని నలుగురు మహిళలు, ఆందోళనగా, నిరాశగా ఎదురయ్యారు. వారి నుండి వచ్చేమట్టి పరిమళమే చెప్పింది వారేంటో…
‘‘ ఒక అయిదు వేలు లోన్ కోసం వచ్చినం సారు.. ఇవ్వం పొమ్మంటున్నారు..’’ అన్నారు.
వారు గొర్రెలు కాసుకొని బతుతున్నారట, స్వార్ధంతో పరుగులు తీసే, ఆర్ధిక సంస్ధలు వారి పట్టుదల ను పెట్టుబడిగా గుర్తిస్తాయా..? వారికెలా చెప్పాలో తెలీక తల వంచుకొని వచ్చేశాం…
ఇదంతా రెండేళ్ల నాటి సంగతి..
ఇపుడు ఆ పేద స్త్రీలకూ సయయం వచ్చింది.
జహీరాబాద్‌లో విసిరేసినట్టున్న భోజ్యానాయక్ తండాను బ్యాంక్ వాళ్లే వెతుక్కుంటూ వచ్చి చెక్ చేతిలో పెట్టారు.
ఎవరికీ పట్టని ఒక మూరుమూల పల్లెలో వారేం సాధించారని, బ్యాంకు వారి వెంట పడి లోన్లు ఇస్తున్నాయి…? …… కోసం తీసిన ఒక జీవన చిత్రం… https://youtu.be/LAu0dC-th5w