జీరో బడ్జెట్‌ సాగులో, పెట్టుబడి ఉంది !

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్రం ప్రతిపాదించిన జీరోబేస్డ్‌ వ్యవసాయ విధానం నేతిబీర లో నేతిని వెతకడం లాంటిదంటున్నారు రైతులు.
ఈ విధానంలో ఆచితూచి అడుగులు వేయకపోతే, చివరకు దేశంలో ఆహారభద్రత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ పద్ధతిలో సాగుచేయడానికి దేశంలో ఆరు కోట్ల టన్నుల సేంద్రియ ఎరువులు అవసరం కాగా.. ప్రస్తుతం 50 లక్షల టన్నులు మాత్ర మే అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సహజ సాగుపై అధ్యయనం చేయకుండా , ఇప్పటికిప్పు డు ఈ విధానాన్ని అమలుచేస్తే భారతదేశ వ్యవసాయరంగం.. వెనుకకు వెళ్లే ప్రమాదం ఉన్నదని, ముందుగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలుచేసి.. దశలవారీగా దేశమంతటా విస్తరించాలని సూచిస్తున్నారు.
‘ కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న సహజ వ్యవసాయ సాగు విధానాలపై దేశవ్యాప్తంగా ఆధ్యయనంచేసి, కేంద్రానికి ఆరునెలల్లో నివేదిక సమర్పిస్తామని’ సహజ వ్యవసాయం సాగు అధ్యయన కమిటీ చైర్మన్‌
వీ ప్రవీణ్‌రావు అంటున్నారు.
” పెట్టుబడిలేని సాగు విధానంతో రైతుల పెట్టుబడులు తగ్గి, ఆదాయాలు పెరిగే అవకాశాలున్నా.. దానితోపాటు పంటల దిగుబడులుతగ్గి దేశంలో ఆహారభద్రత దెబ్బతినే ప్రమాదం ఉన్నది. కరవు ప్రాంతాలకు ఈ పద్ధతి అనుకూలం. జీరో బేస్డు సాగు అంటే పెట్టుబడి ఉండదని కాదు,కూలీలకు, విత్తనాలకు ఇతర ఖర్చులు ఉంటాయి. ఉన్న పళంగా సహజ సాగును చేయడం సాధ్యం కాదు, ఐదేళ్ల వరకు భూమిని సేంద్రీయ ఎరువులకు అలవాటు చేయాలి. ” అని ఆదిలాబాద్‌ జిల్లా లో సేంద్రియ పంటలు సాగు చేస్తున్న రవీందర్‌ అంటారు.

Share.

Leave A Reply