ఇవి చెప్పులు తొడగని పాదాలు !!
తంగేడు పొదల మధ్య సన్నని కాలిబాటలో నడుస్తుంటే, దూరంగా ఆకుపచ్చని అభయారణ్యం మధ్య ఎర్ర పెంకుల ఇండ్లు అక్కడక్కడా మోదుగ పూలగుత్తుల్లా మెరుస్తుంటాయి. వాటి చుట్టు వెదురు కర్రలతో ఫెన్సింగ్ ,వాటికి అల్లుకొని కాకర చిక్కుడు తీగలు, పక్కనే వేప, ఇప్ప చెట్లు ఉంటాయి. రాళ్ల నేలలో పలుగు ,పారతో మొలకు చిన్న గుడ్డ చుట్టుకొని నిటారుగా నడుస్తుంటాడు నల్ల తుమ్మ చెట్టులాంటి సోడి గంగ.
తెలంగాణ లో కొత్తగూడెం నుండి 70 కిలో మీటర్లు వెళ్లి, మోకాళ్ల లోతులో వాగు దాటితే లక్ష్మీదేవిపల్లి మండలంలో క్రాంతినగర్ తండా వాసి, సోడి గంగ వయస్సు 70 ప్లస్. అయినా ఉత్సాహంగా నిత్యం ఆరు కిలో మీటర్లుకు పైగా నడుస్తాడు. అడవుల్లో తేనె, తునికిపండ్ల కోసం మైళ్ల దూరం నడుస్తుంటాడు కానీ, ఎంత ఎండ ఉన్నా చెప్పులు వేసుకోడు. complete story…in andhrajyothi
