The Story in a Single Shot

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆకలి తీరే దారి లేక మధ్యాహ్న భోజనం సమయానికి గుడిమల్కాపూర్‌లోని ఓ క్లాసు రూమ్‌ దగ్గర ఆశగా చూస్తున్న పేదబిడ్డ ఫొటో నిన్న పత్రికలో చూసినప్పటి నుండీ తీవ్రంగా డిస్ట్రబ్‌ అయ్యాను. ఆ ఫొటో గ్రాఫర్‌ ఎవరో కానీ, ఒకే క్లిక్‌లో మొత్తం పేదరికాన్ని డాక్యుమెంట్‌ చేసి సభ్యసమాజం సిగ్గుపడేలా చేశాడు. ఆ బిడ్డను బడిలో వేసే మార్గాల గురించి చాలా మందితో మాట్లాడి అలసి, నిద్ర రాక రాత్రి చాలా లేట్‌గా నిద్రపోయాను.
ఉదయం లేచి పేపర్‌ చూస్తే…
ఆ చిట్టితల్లి యూనిఫాం వేసుకొని అదే స్కూల్లో ఒకటో తరగతిలో చేరిందని రాశారు. ఆ బిడ్డ దయనీయ జీవనం విద్యాశాఖను కదలించి, ఆ పాప ఆచూకి తెలుసుకొని స్కూల్లో వేశారట.
దేవుడు ఎక్కడో కొండ మీద ఉండడు . ఇలాంటి మనుషుల గుండెల్లో ఉంటాడు. ఈ ఫోటో తీసిన ‘ఈనాడు ‘ ఫొటో గ్రాఫర్‌ పాదాలు కనిపిస్తే చెప్పండి.. – Shyammohan

Share.

Leave A Reply