ఇదొక మానవీయ విజయం

Google+ Pinterest LinkedIn Tumblr +

అమలు కాని వాగ్దానాలను ఇవ్వడానికి నిరాకరించి, ఓటమికే సిద్ధపడిన వై.ఎస్‌.జగన్‌ వంటి నవతరం నాయకుడు రాజకీయాల్లో కాగడా పట్టుకొని వెతికినా కనిపించడు. అవినీతి, స్వార్థాలే పరమార్థాలుగా పతనమవుతున్న నేటి రాజకీయ వ్యవస్థలో జగన్‌ గెలపు, ఒక మేలి మలుపు. 
జగన్‌ రాజకీయ రంగంలోకి ప్రవేశించి సరిగ్గా పదేళ్లు. ఈ పదేళ్లలో ఆయన వేసిన ప్రతీ అడుగు, తనను తాను మలుచుకున్న తీరు ఆయనకు జీవితాంతం పాఠాలు చెబుతుంది. మా మాట వినకుంటే కష్టాలపాలవుతావని భయపెట్టజూసినా చలించకుండా జగన్‌మోహన్‌రెడ్డి నిబ్బరంగా నిలబడిన తీరు అనన్యసామాన్యం. 
జగన్‌ని బెదిరించారు, అదిలించారు, తను లొంగలేదు. 
సొంతంగా పార్టీ పెట్టాడు, సోనియాకు సవాల్‌ విసిరాడు. ఫలితంగా కేసులు. జైల్‌ లో వేశారు.బయటకు రాకుండా బెయిల్‌ ఇవ్వకుండా నెలల పాటు నలిగిపోయాడు. మరొకరైతే, సరెండర్‌ అయిపోయే వారు. మానసికంగా కుంగి పోయే వారు. జగన్మొండి కదా, మడమ తిప్పలేదు. 
సీన్‌ కట్‌ చేస్తే…. 
జగన్‌ కష్టాలు చూసి, పట్టించుకోకుండా కళ్లు మూసుకున్న అప్పటి సీఎంని జనం మర్చిపోయారు … 
కేసు పెట్టిన వాళ్లు ఎక్కడున్నారో తులీదు…? 
జైలుకు పంపిన అధికారి ఏమయ్యాడు? జగన్‌ పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. 
దీనికంతటికీ కారణం అయిన అప్పటి ఢిల్లీ నాయకురాలి పార్టీ ఇప్పుడు మోడీ చేతిలో విలవిల లాడుతోంది. 
మళ్లీ జగన్‌ని జైలుకు పంపాలని ఎన్ని కుట్రలు,కుయుక్తులు… ఇవన్నీ ఓపిగ్గా భరిస్తూ, నిలబడి , కలబడి ఒంటరి పోరు చేసి, ఇపుడు జనం జేజేలు పొందాడు జగన్‌. ఈ అపూర్వ విజయపు క్షణాల్లో నాటి చీకటి రోజులు గుర్తు చేసుకుంటే , ఈ గెలుపు మరింత సంతోషం ఇస్తుంది. 

” చేయని తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినా, జైల్లో మగ్గాల్సి వచ్చినా మాట తప్పని తీరునూ, మడమతిప్పని తత్వాన్ని జనం క్రమంగా అర్థం చేసుకున్నారు. విలువలతో కూడిన రాజకీయ జీవితం కోసం ఆయన తనను తాను కష్టపెట్టుకున్న తీరును వివేక వంతులైన జనం గమనించారు. రాజకుమారుడిలాగా జీవించే అవకాశాలున్నా తణప్రాయంగా కాలదన్ని భార్యా పిల్లలకు దూరంగా, కష్టాల కొలిమిలో తనను తాను కాల్చుకున్నాడు. 
అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలాడు. 
రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రజల్లో తిరుగుతూ, వాళ్ల బాధలు, గాథలు వింటూ ధైర్యం చెబుతూ తన చెమట చుక్కలు ధారబోసి ఒక రాజకీయ పార్టీని ప్రజల హదయాల్లో ఆయన నిర్మించాడు…” అని, సీనియర్‌ సంపాదకుడు వర్ధెల్లి మురళి అంటారు. 
బైబిల్‌ లో ఒక మాట ఉంది. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింప బడును. కడపటి వాడు మొదటి వాడగును, మొదటి వాడు ఆఖరి వాడగును. 
జగన్‌ విషయంలో ఈ వ్యాఖ్యం నిజమైంది. -Shyammohan,- 9440595858

Share.

Leave A Reply