సాగు యంత్రాల ట్రాక్టర్‌ నగరం

Google+ Pinterest LinkedIn Tumblr +

అది అనేక దశాబ్దాలుగా రైతులకు నమ్మకమైన నేస్తం. గ్రామీణ మహిళలు అక్కడ రకరకాల ట్రాక్టర్లతో సహా వివిధ వ్యవసాయ పరికరాలు ఉపయోగించడంలో శిక్షణ పొందుతారు.
మరో పక్క రైతులు వ్యవసాయ యంత్రపరికరాల వినియోగం నిర్వహణ రిపేర్ల మీద సైతం శిక్షణ పొందుతారు. అదే సమయంలో ఇంజనీరింగ్‌ , పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈ వ్యవసాయ యంత్రపరికరాల పనితీరును అధ్యయనం చేసి ఇక్కడే క్షేత్రస్థాయిలో శిక్షణ పొందుతారు. కొత్తగా తయారైన వ్యవవసాయ యంత్రపరికరాలకు ఇక్కడ ఆమోద ముద్ర పడిన తర్వాతే మార్కోట్లోకి వెళ్తాయి.

అటువంటి అరుదైన సంస్థ ఉన్న ప్రాంతం పేరు ట్రాక్టర్‌ నగర్‌.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా , గార్లదిన్నె గ్రామంలో ఉంది.
వ్యవసాయ ఇంజనీరింగ్‌ విధ్యార్థులకు కల్పతరువు ఈ ట్రాక్టర్‌ నగర్‌… ఏ కొత్త వ్యవసాయ యంత్ర పరికరమైనా నాణ్యత, క్షేత్రస్థాయిలో పనితీరుకు సంబంధించి ఇక్కడి పరీక్షల్లో ఆమోద ముద్ర పొందాల్సిందే!
అత్యుత్తమ సంస్థల్లో ఒకటి
ప్రశాంత వాతావరణంలో, ఆహ్లాదకరమైన పరిసరాల్లో విద్యార్దులు
ఆధునిక వ్యవసాయ పరికరాల పనితీరు గురించి పుస్తకాల్లో మాత్రమే చదవటం కాకుండా , ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో శిక్షణ పొందుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖలోని రైతు సహకార , సంక్షేమ విభాగం
కింద ఈ సంస్థ ఏర్పాటైంది. దేశంలోని నాలుగు అత్యుత్తమ సంస్థల్లో ఇదొకటి .
ఎవరికి శిక్షణ
ఇక్కడ ఆధునిక వ్యవసాయ పరికరాల ఉపయెగం వాటి మరమ్మత్తులపై అవగాహన పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వ్యవసాయ ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ విద్యార్థులతో పాటు, నిరుద్యోగ యువకులు, రైతులు కూడా శిక్షణకోసం ఇక్కడికి వస్తారు.
యంత్రాల వాడకంలో శిక్షణకు వివిధ కాల పరిమితుల్లో పూర్తయ్యే కోర్సులు ఇక్కడ బోధిస్తారు. శిక్షణాకాలంలో కోర్సులకు ఉపకార వేతనం ఇచ్చి మరీ శిక్ష ఇస్తున్పారు. వారం నుంచి ఆరు వారాల
వరకూ శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. వ్యవసాయ యంత్రాలఎంపిక , పవర్‌ టిల్లర్‌ వినియోగం,యాజమాన్య పద్ధతులు మహిళా రైతులకు ఆధునిక వ్యవసాయ పనిముట్ల వినియోగం మొదలైన అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. రైతులు కోరిన మీదట దుక్కిదున్నే యంత్రాలు ,నాట్లు వేసే యంత్రాలు, కోతలు కోసి కుప్ప నూర్చే యంత్రాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి వాటి వినియోగం గురించి వివరిస్తున్నారు.
ఉపాధి అవకాశాలు
ఇక్కడ శిక్షణ పొందిన నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందారు. ట్రాక్టర్‌ నగర్‌లో ఆధునిక వ్యవసాయ
పరికరాలపై ఇప్పటివరకు దాదాపు 40వేల మంది విధ్యార్థులు శిక్షణ పొందారు. వారే కాకుండా రైతులు , గ్రామీణ మహిళలు క్షేత్రస్థాయిలో యంత్రాల వాడకం , నిర్వహణ మొదలైన అంశాల్లో శిక్షణ పొందవచ్చు. కొత్త యంత్రాలు, వాటి పనితీరు, విడిభాగాలు
పనిచేసే విధానం వంటి అనేక అంశాల మీద అవగాహన పెంచుకోవడమే కాదు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు.
– వక్కలంక సీతారాం

(Southern Region Farm Machinery Training and Testing Institute is situated at about 24 kms away from Anantapur District place and 4 kms from Garladinne town.  The nearest Railway Station is Garladinne (South Central Railway) which is also located on NH-44  It is about 233 km from Bangalore and 343 km from Hyderabad. )

Share.

Leave A Reply