ప్రకృతి పానీయం …రుచి చూస్తే వదలరు!! శుద్ధమైన తాజా కల్లు .అమృత పానీయం. సర్వరోగనివారిణి.ఇదేమీ ప్రాణాలను హరించే అల్కహాలు కాదు. రసాయనా ల తో మత్తెక్కించే లిక్కర్ కాదు. కల్తీ లేని కల్లు ఆరోగ్యదాయకమే.అసలు సిసలు భారతీయ సురపానీయం మన కల్లు ఒక్కటే…దాని చుట్టూ ప్రకృతితో అనుబంధం, సంప్రదాయం, కుల వృత్తుల మేళవింపు ఉంది. అప్పుడే చెట్టుమీద నుండి తీసిన తాజా పానీయం లో అనేక ఔషధగుణా లున్నాయి . ఆరు రకాల చెట్ల నుండి తీస్తున్న ప్రకృతి పానీయం మీద గత ఆరేళ్లుగా పరిశోధనలు చేస్తున్న మైక్రోబయాలజీ ప్రొఫెసర్ భూక్యా భీమా, కల్లు లోని అరుదైన ఆరోగ్య రహస్యాలను కనుగొన్నట్టు మాకు చెప్పారు .
అన్ని రకాల కల్లు కోసం త్వరలో హైదరాబాద్లో నీరా కేఫ్ ఏర్పాటు కాబోతుంది. నగర జీవులకు కొత్త రుచు లు చూపించ బోతుంది. హుస్సేన్ సాగర్ తీరంలో చిటపట చినుకు లు పడుతుంటే, గొంతులోకి నీరా దిగుతుంటే, చెప్పలేని ఆ హాయి కోసం ఎదురు చూడండి…
కల్లు లోని ఆరోగ్య రహస్యాల కోసం సైంటిస్ట్ వెంగయ్య గారికి ( ఫోన్. 9493128932 ) కాల్ చేయండి.
పూర్తి కథనం ఈ కింది ( Andhra jyothi- 30.8.2020 ) క్లిప్పింగ్లో చదవండి.
