దేశానికే దిక్సూచి,గొడిగార్‌ పల్లి !!

Google+ Pinterest LinkedIn Tumblr +

   వర్షపు నీటిని దోసిట పడితే, భూగర్భ దాహం తీరుతుంది. పంటపొలాలు పచ్చదనంతో తొణికిసలాడతాయి. ఒకపుడు తాగునీటికే కటకటలాడిన తెంగాణలోని గొడిగార్‌పల్లి ఇపుడు మూడు పంటల తో మురుపిస్తోంది. జనమంతా కలిసికట్టుగా చతుర్విధ జల ప్రక్రియను చేపట్టి, దేశానికే దిక్సూచిగా మారారు. రాజస్ధాన్‌ ముఖ్యమంత్రిని సైతం అకట్టుకున్నారు.రెండువేల గడపలున్న గొడిగార్‌ పల్లి, సంగారెడ్డి జిల్లా  లోని ఒ కుగ్రామం. ఒకపుడు తాగడానికి కూడా చుక్క నీరు దొరికేది కాదు. వర్షం కురిస్తేనే పంట, లేకుంటే పస్తులె… ఇపుడు కథమారింది. ఊరు పొలిమేరల్లోకి అడుగు పెడుతూనే ఆకుపచ్చని చీరు ఆరబెట్టినట్లు పచ్చదనం కనువిందు చేస్తుంది.

‘ఒకపుడు బావుల్లో చేతికి అందే లోతులో నీరుండేది. చెంఋ, బిందెల తో తోడుకునేవాళ్లం. ఆ రోజులు రావనుకున్నాం. కానీ ఇపుడు కళ్ల జూస్తున్నాం..’ అని సంతోషంగా చెప్పారు గ్రామస్ధులు.

 ఆనాటి ఐక్యరాజ్యసమితి సహాదారు, టి.హన్మంతరావు ఆ పల్లె ప్రజను ఏకం చేపి, జల సంరక్షణలో భాగస్వాముల ను చేసి.   చతుర్విధ జల ప్రక్రియకు ప్రాణం పోసిన తీరును రూరల్‌ మీడియా టీం వీడియో డాక్యుమెంట్‌ చేసింది… ఈ లింక్‌లో చూడండి..https://youtu.be/tzrq-mA5k7w

Share.

Leave A Reply