ఇది ప్రతీ పల్లె కథ..ప్రతీ వాడ కథ..

Google+ Pinterest LinkedIn Tumblr +

పలాస 1978  ” బుగతా ఇను ఇను సెబుతా ఇను ఇనుమా ఊరి వైబోగం “
ఆ గొంతుకలోని అనాది మార్మికత పేగును కదిలించలేదా..
” సీకాకులవు జిల్లా..పలస మావూరే వలె బామా.. నాదుక్కు సూస్తూనే సెపుతావ వింటాను వలెబామా…”
అచ్చమైన జానపదం..డప్పు చప్పుళ్ళు గుండెను దరువును పెంచలేదా..
              Yes..its Original..
మాండలికాన్ని యాసగా , కామెడీ గా మార్చిన తెలుగు సినిమా కు పదాల సొగసును అర్ధం చేసుకునేంత , అందరి మనుషుల్నీ ఓన్ చేసుకునేంత పెద్ద మనసు లేదు.ఇప్పట్లో రాదు.
పిండిబొమ్మనీ..ప్రాణం లేనిదనీ అన్న వాళ్ళు జర సైడ్ అయిపోండి.. మీరు కనెక్ట్ కాలేరు.నూతినీళ్ళదగ్గర..తినే మెతుకు దగ్గరా అవమాన0 మీకు తెలియదు కాబట్టి.
ఎక్కడివో దేశాంతర సినిమాల్లో ని ప్రపంచ యుద్ధ సినిమాల్లో హింసా..బాలీవుడ్ parallel సినిమాలూ..బెంగాలీ మూవీ ల లెక్చర్లూ ఇచ్చేచాలామందికి ఎదురుగా ఉన్న కులవివక్షను చర్చించడం నచ్చదు.
సమర్పించిన పెద్దలూ ..ప్రముఖులూ పదే పదే “మీ సినిమా.. మీ సినిమా ” అని నొక్కివక్కాణిస్తుంటే తెలియడం లేదూ..దళిత చైతన్యం అంటే వాళ్ళకెంత భయమో..
ఉత్తరాంధ్ర అయినా తెలంగాణ అయినా రాయలసీమ అయినా తరతరాల feudalism.. అణచివేత ..పీడన..దళితుల పట్ల అరాచకమూ ఒక్కటే.
‘ బైరాగి రాయిని ఎత్తగలిగినోడివి..బైరాగిని ఎత్తలేవ ‘ హాలు మోగే చప్పట్లు వినిపించాల్సిన సీన్..కానీ వినిపించలేదు..దీన్ని బట్టి తెలియడం లేదూ ఆధిపత్య భావజాలానికి అట్టడుగు ఐకమత్యం అంటే ఎంత భయమో…
ఆ భయాన్ని నిర్భయంగా చూపించిన కరుణ గారూ హ్యాట్సాఫ్.
భాషా, పాటలూ మాత్రమే కాదు. కథా కథనం కూడా ఎలాంటి తొట్రుపాటు లేకుండా.. Screenplay కూడా Drag లేకుండా పక్కాగా ఉంది.పాత్రలూ..పాత్రధారుల నటనల్లో ఎక్కడా ఓవర్ యాక్షన్ లేదు. నిజాయితీగా తమ పరిధుల మేరకు నటించారు. రఘు కుంచె గారు amazing.
ఇది ప్రతీ పల్లె కథ..ప్రతీ వాడ కథ.. ఎలెక్షన్ ల సమయాల్లో ఊరూరా కనిపించే ‘loyal’ మోహనరావుల కథ. సుఖానికి దుఃఖానికి పక్కన నిలబడ్డ ‘దండాసి ‘పాత్ర ఎంత నచ్చిందో.మన తాతలో బాబాయిలో కళ్ళముందు ఎన్నో ఘోరాలను చూసిన అనుభవం ఉన్న పాత్ర.ఎందుకో చప్పున ఆ పాత్రకు relate అయ్యాను.పాత్రధారిని ఒక్కసారి కలవాలి.
కరుణ గారి కష్టం ప్రతీ ఫ్రేమ్ లో కనిపించింది.అయితే రెండు మాటలు..సెబాస్టియన్ నిరాశ ..క్లయిమ్యాక్స్ ..మోహన్ రావు చదువూ ఏ తీరాలకూ చేరకపోవడం నిస్తేజం కలిగించింది.చదువు నేర్చిన మోహన్ రావు సెబాస్టియన్ ఇంకొంతమంది కి స్ఫూర్తి కలిగించే పనులేవైనా చేసి ఉంటే బావుండేది.సహజత్వం లోపిస్తుందనుకున్నారో ఏమో కరుణ గారు సినిమాటిక్ ఎండింగ్ ని ఎంచుకోలేదు.మోహన్ రావు ప్రస్థానం ఒక చిన్న positive నోట్ తో ముగించాల్సింది.
చివర్న మోహన్ రావు ప్రస్తావించిన యూనివర్సిటీ ల్లో దళిత పిల్లల ఆత్మహత్య.. ప్రేమించినందుకు హత్యలూ ఇప్పటికే వైరల్ అయ్యాయి.భుజాలు తడుముకుంటూనే తప్పనిసరయి చప్పట్లు కొడుతున్నారు..సంతోషం.

Rajitha Kommu

ఏ మాత్రం విషయం లేని ఫాల్తూ సిన్మాలను కూడా ఇన్నేళ్ళూ మోసామ్. ఇది అట్టడుగు జీవన విధానాన్ని ఒడిసిపట్టిన సినిమా. అందరూ తప్పకుండా చూడండి..ఇప్పటికైనా ‘కులవివక్షను’ విస్తృతంగా చర్చించాలి.అంతరాల.. అంతస్థుల తేడాను కాదు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన కరుణ గారు and టీమ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు.
Majoritarianism..సాటిమనుషుల పట్ల ద్వేషమూ..మతం ముసుగులో దాడులూ..దారుణాలు  జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు కావాలి. ‘పలాస 1978 సినిమా నేటి అవసరం ‘
  – Rajitha Kommu. (Principal, Govt.Junior College,Peddemul.Ranga Reddy, TS)

Share.

Leave A Reply