ఇల అనంతపురంలో, సరిలేరు వీరి కెవ్వరూ…

Google+ Pinterest LinkedIn Tumblr +

” ఒకపుడు ఇక్కడ పెద్ద చెరువు ఉండేది, మా పూర్వీకులు ఈ నీటితోనే వ్యవసాయం చేసి బతికేవారు. అందుకే మా పల్లెను ‘చెర్లోపల్లి’ అంటారు. క్రమంగా వానలు తగ్గిపోయి చెరువు మాయమై కరవు ఏర్పడింది. నీళ్లు లేక, సాగు లేక, ప్రజలు వలసలు వెళ్ల సాగారు. పరిస్ధితులు ఇలాగే ఉంటే ,ఊరంతా ఖాళీ అవుతుందని గ్రహించి మేమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏడాదిలో ఎప్పుడో ఓసారి పడే నాలుగు వర్షపు చుక్కలను కాపాడు కోవాలి.
అంతకంటే వేరే ఆధారం లేదు. నేలలో ఇంకిన నాలుగు వాన చుక్కలతోనే పచ్చదనాన్ని వెతుక్కోవాలని, అందరం ఏకమై కురిసిన వానను మా పొలాలు దాటకుండా అడ్డుకున్నాం.. అంతే!! ఈ రోజు ప్రతీ పొలమూ, పంటలతో నిండుగా మారింది..” అని తన పొలంలో పండిన పల్లీలు చూపించి సంతోషంగా చెప్పింది, చెర్లోపల్లి వాటర్‌ షెడ్‌ కమిటీ ఛైర్మన్‌ సహరాబీ.


అనంతపురం జిల్లా, ఓ.డి. చెరువు మండలంలోని, చెర్లోపల్లి సమీప గ్రామాల్లో, ఎక్కడ చూసినా ఎండిపోయన బావులు, బోర్లులో నీళ్లు లేక , పంటలు లేక ఉపాధి కరువైంది. వలసలు పెరిగాయి. ఆడవాళ్లు లేచింది మొదలు నీళ్లను వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది. తాగునీరు, సాగునీరు అందక కరువు తాండవమాడేది. నీటికొరతే బాధలకు మూలమని గ్రహించారు. వానలు మాత్రమే పంటలకు ఆధారమని, చినుకు పడ్డపుడే ప్రతీబొట్టును దాచుకోవాలని నిర్ణయించుకొని పలుగూ,పార అందుకున్నారు.. కరవును తరిమిన వారి గెలుపు కథను ఈ ఫిల్మ్‌లో చూడండి!! https://youtu.be/O6ToQckoXTI

Share.

Leave A Reply