‘సైరా’ ని షేక్‌ చేస్తున్న ఈ చరిత్రకారుడు ఎవరు?

Google+ Pinterest LinkedIn Tumblr +

( ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి చరిత్ర చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి. అతనే అసలైన సమరయోధుడు అని , ఆ చరిత్ర ఆధారంగానే సినిమా తెరకెక్కిందని, సినీ నిర్మాతలు అంటుంటే , స్వాతంత్రసమర యోధుడి జీవితచరిత్రగా ప్రచారం అవుతున్న’ సైరా నరసింహారెడ్డి ‘ ది అసలు స్వాతంత్య్రపోరాటమే కాదంటున్నారు, ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, బొల్లోజు బాబా. కాకినాడలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న బాబా పలు చారిత్రక అంశాలతో పుస్తకాలు రాశారు. తాను లేవనెత్తిన వివాదాస్పద చారిత్రక కోణం పై ఇలా వివరణ ఇచ్చారు.)

నేను “కనీసం తొలిపాలెగాండ్రపోరాటం కూడా కాదు” అని పెట్టిన పోస్టు లోని విషయాలకు ఆధారాలు ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు.

దీనికి మూలం
A PhD thesis done in 2006, named “Country police system 1550-1857 AD A study in ceded districts of rayalaseema region of Andhra Pradesh done by Robert.B. John under the guidance of Dr. Nayak k. Krishna of Sri Krishna Devaraya University, AP.

చరిత్రకారులు విషయనిర్ధారణ ఈ క్రింది విధాలుగా జరుపుతారు
1. శాసనాలు
2. ట్రావెలాగ్స్
3. గెజటీర్స్. శాసనాల స్థానంలో ఇవి వచ్చి చేరాయి
4. ఆత్మకథలు
5. అప్పటి సమకాలీన ఉటంకింపులు/న్యూస్ పేపర్లు. (జీసస్ గురించి బైబిల్ నుంచి కాక సమకాలీన ఉటంకింపులు గొప్ప రీసర్చ్ అంశం.)
6. వ్యక్తిగత డైరీలు లేదా మెమొయిర్స్
7. ఇంటర్వ్యూలు
8. వాజ్మయం – (ఇక్కడ కళాత్మకతకోసం అతిశయోక్తులు ఉంటాయి, సమాచారాలేమి ఉండొచ్చు, ప్రొపగాండా కూడా కావొచ్చు. కనుక ఒక స్థూల అవగాహనకొరకే తప్ప నిర్ధారణల కొరకు వాజ్మయం ప్రామాణికం కాదు.) పైన ఇచ్చింది దాదాపు ప్రాముఖ్యతా వరుసక్రమమే అనుకోవచ్చు నేను చాలా కామెంట్లలో చెప్పినట్లు ఈ మొత్తం ఉదంతంలో “భారతదేశ తొలి స్వాతంత్ర్యపోరాటం” అన్న మాట పట్లే నా ప్రధాన అభ్యంతరం. అలాంటి ప్రకటనలు చాలా ప్రమాదకరమైనవి అని తలుస్తాను.

మనల్ని ప్రపంచం ఎదుట నవ్వుల పాలు చేస్తాయి కూడా.

ఇక పోతే చరిత్ర అనేది మనకు నచ్చినట్లుగా, మనకు కావలసిన విధంగా జరగదు. ఆ విషయం ముందు తెలుసుకోవాలి.
చరిత్రపై నా అవగాహన ఇలా ఉంది

1. స్వాతంత్ర్యపోరాటం ముగిసిపోయింది. ఇంకనూ బ్రిటిష్ పాలనను అంతా పీడన గా భావించాల్సిన ఉద్వేగాలు అనవసరం లేదు
2. కలోనియల్ రూల్ మంచి చెడులను విశ్లేషించాల్సిన అవసరం ఉంది
3. భారతీయ సమాజానికి వారు చేసిన నిర్మాణాత్మక, సామాజిక, శాస్త్రీయతా బీజాలను వెలికి తీయాలి.
5. ముందు మనం తెల్లవాడిపై కత్తికట్టిన ప్రతి ఒక్కడూ దేశభక్తుడే లాంటి అవాంఛిత భావోద్వేగాలనుండి బయట పడాలి

***
చరిత్రను కుంఫిణీ పాలన, క్రౌన్ పాలనలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. 1858 నాటి చార్టర్ లో బ్రిటన్ రాజ్యాంగం, బ్రిటన్ పౌరులతో సమానమైన హక్కులు, బ్రిటన్ పరిపాలనావ్యవస్థ- భారతీయులకు కూడా వర్తింపచేస్తామన్న హామీ ఉంది. అప్పటినుంచే నిజమైన బ్రిటిష్ ప్రభుత్వ పాలన మొదలైంది.

అంతకుముందుదంతా 15-20 మంది ఈస్ట్ ఇండియా కంపనీ వ్యాపారస్తులు పిట్స్ చార్టర్ ద్వారా తెచ్చుకొన్న కొన్ని సదుపాయాలతో మనపై చేసిన ఆధిపత్యం.

ఇక ప్రస్తుత చర్చలోని పోరాటాన్ని ఫ్యూడల్ శక్తుల తిరుగుబాటుగానే భావిస్తాను.
ఆ వ్యవస్థను పునఃస్థాపించటం కొరకు చేసిన ఒక ప్రయత్నంగానే చూస్తాను.

(అన్నికులాల శ్రామికులతో ఏడాదంతా పనిచేయించుకొని పంటల కోత సమయంలో భూస్వామి వారికి ధాన్యం కొలిచివ్వటం; ఒక ఊరిలోని శ్రామిక కులాలను ఊరు దాటి మరో ఊరు వెళ్లకుండా కట్టడి చేయటం ఫ్యూడల్ వ్యవస్థ ప్రధాన లక్షణాలు- పరోక్ష వెట్టి చాకిరీ ఇది)

యానాం విమోచనోద్యమం, ప్రెంచిపాలనలో యానాం అనే రెండు చరిత్రపుస్తకాలు వ్రాసిన రచయితగా ఇది నా అభిప్రాయం.
You are free to differ with me. I respect your views.

“కనీసం తొలిపాలెగాండ్రపోరాటం కూడా కాదు” అనే పోస్టుకు సంబంధించిన ఆధారాలను ఈ క్రింది పి.డి.ఎఫ్ లో ఆసక్తి కలిగినవారు చదువుకొనవచ్చు. ప్రస్తుత చర్చకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను హైలేట్ చేసాను గమనించగలరు. – – -బొల్లోజు బాబా

Share.

Leave A Reply