చంద్రకళ చంద్రకళ… అక్రమార్కులకు గుండెదడా…

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇదంతా ఈ రోజే విడుదలయిన చంద్రకళ సినిమా గురించి ఎంత మాత్రం కాదు. వాస్తవ జీవితంలో అవినీతి పరులను పరుగులు పెట్టిస్తున్న ఓ ఆదివాసీ ఉన్నతాధికారి సాహస గాధ.
ఉత్తర ప్రదేశ్‌లో ఓ తెలుగు ఐఏఎస్‌ అధికారిణి సంచలనం సృష్టిస్తున్నారు. అట్డడుగు ఆదివాసీ తండా నుండి అత్యున్న అఖిలభారత సర్వీసులకు ఎంపికై ఉత్తర ప్రదేశ్‌లో పని చేస్తున్న భూక్యా చంద్రకళ అక్కడి అవినీతి ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. బులంద్‌షహర్‌ జిల్లాలో బుధవారం రహదారుల పనుల్లో జరుగతున్న అవకతవకలపై ఆమె దృష్టిపెట్టారు. నాసిరకం టైల్స్‌,ఇటుకలు వాడుతున్నట్టు ఆమె గమనించి ఆ పనులు చూస్తున్న ఉద్యోగులను పిలిచి తీవ్రంగా మందలించారు. అక్రమాలకు పాల్పడుతున్న గుత్తేదారులను,అధికారులను జనం మధ్యకు పిలిచి కడిగేశారు. కొన్ని కాంట్రాక్టులను రద్దు చేసి దోషుల పై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ‘ మీలో కాస్తయినా నిజాయితీ ఉందా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? మిమ్మల్ని జైలుకు పంపుతా” అంటూ మండి పడ్డారు.ఊహించని పరిణామానికి అధికారులు అవాక్కయ్యారు. ఈ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో ఆసక్తిని రేపుతోంది….
యూపీకేడర్‌కి చెందిన చంద్రకళ ఇంతకు ముందు మధుర కలెక్టర్‌గా పనిచేశారు. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా,రామగుండం ఆమె సొంతూరు. స్కూల్‌ విద్యను అక్కడే చదివి , డిగ్రీ,పోస్టుగ్రాడ్యుయేషన్‌ హైదరాబాద్‌లో పూర్తిచేసి 2008లో సివిల్స్‌కి ఎంపికయ్యారు. చంద్రకళ భర్త రాములు శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టులో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

Share.

Comments are closed.