Ten Years Challenge from Andhra tribals?

Google+ Pinterest LinkedIn Tumblr +

పదేళ్ల క్రితం నువ్వెలా ఉండేవాడివి… ? ఇపుడెలా ఉన్నావ్‌..? అంటూ ఫేస్బుక్‌ మొదలెట్టిన ఛాలెంజ్‌ కు కొత్త సవాల్‌ విసురుతున్నారు ఈ ఆదివాసీలు… 
తూర్పుగోదారి జిల్లా, రంపచోడవరం ఐటీడీఏలో రెండు గ్రామాల మధ్య ఈ దృశ్యాన్ని రూరల్‌మీడియా క్యాప్చర్‌ చేసింది. తనుకురాతిపాలెం నుండి వేటమామిడి కి రావాలంటే ఈ ఏలేరు నది దాటి రావాలి. రోజుకు మూడొందల మంది అటు ఇటూ ఇలాగే నడుం లోతు నీళ్లలో దిగి వెళ్లాలి. ” గత పదేళ్ల నుండి ఇదే పరిస్ధితి, ఎలాంటి మార్పు లేదు, ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా, ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. దీనిని మీరు లోకానికి చూపించినా పట్టించుకుంటారనే నమ్మకం లేదు… ఇదే మా ఛాలెంజ్‌..” అంటున్నారు వేటమామిడిలో పొదుపుసంఘం నాయకురాలు సత్యవతి. 
వానా కాలంలో అయితే ఈ నది పొంగుతుంది. కొన్ని సార్లు కొందరు కొట్టుకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు అక్కడి ప్రజలు.

Share.

Leave A Reply