నేలమ్మ …పద్మమమ్మ

Google+ Pinterest LinkedIn Tumblr +

నేలను పునరుజ్జీవింప చేస్తున్న …. పద్మమమ్మ 
 ” ఈ నేల ఒకపుడు రాళ్లు,రప్పలతో ఉండేది. నేనూ నా బిడ్డలు రాత్రీపగలూ కష్టపడి సాగుకు అనువుగా మార్చినం. ఇపుడు మామిడి తోటను వేసినం ” అని కొండంత ఆత్మవిశ్వాసంతో చెబుతోంది . పద్మమమ్మ. రంజోలు గ్రామంలో పనికి రాని నేలను పచ్చని పంట భూమిగా మార్చడంలో ఆమె కృషి అపూర్వం. 
అంతే కాదు తన భూమి స్వభావాన్ని కనిపెట్టి దానిని కాపాడు కునే ప్రయత్నం చేస్తుంది. రసాయన ఎరువులు వాడకుండా తాను సొంతంగా జీవామృతాన్ని తయారు చేసి పొలంలో చల్లుకుంటోంది. ఈమె సాగు చేస్తున్న 
భూమి గట్టిది. దానిని గుల్లగా,తేమగా మార్చడానికి ఆమె పొలంలో పాదులతీసి ఎండుగడ్డిని,పచ్చ రొట్టను వేస్తుంది. దీని వల్ల నేలలో తేమ పెరగడమే కాక ఆవిరి కాదు. నేలలో జీవరాసులు పెరగడానికి ఉపయోగ పడుతుంది. సేంద్రియ పదార్ధం వృద్ధి చెందుతుంది. 


తనతో పాటు తమ గ్రామ మహిళలను కలుపుకొని స్వయం సహాయసంఘంగా ఏర్పాటు చేసింది. ఇపుడు అందరూ ఐకమత్యంగా తమ భూములను అభివృద్ది చేసుకుంటున్నారు. వర్షపు నీరు పల్లపు ప్రాంతాల్లోకి జారి పోకుండా తమ భూముల్లోనే ఇంకి పోయేలా ఉపాధి హామీ పనులలో భాగంగా ఇంకుడు గుంతలు, చెక్‌ డ్యాంలు నిర్మించుకున్నారు. వీరి శ్రమ ఫలించింది. ఇపుడు కొందరు రైతులు కంది,పత్తి,చెరకు పండిస్తున్నారు. అంతరపంటలు కూరగాయలు పెంచుతున్నారు. ఉపాధిహామీ పనుల వల్ల పర్యావరణం కూడా కాపాడు కోవచ్చని పద్మమమ్మ నిరూపించారు.

Share.

Leave A Reply