కేసీఆర్‌ దెబ్బకు, విజై మాల్యా లబోదిబో

Google+ Pinterest LinkedIn Tumblr +

కేసీఆర్‌ దెబ్బకు, విజై మాల్యా లబోదిబో Muscle Relaxant purchase Strattera Propranolol 40mg
అసలే కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ దెబ్బకు కుదేలయి పోయిన లిక్కర్‌ కింగ్‌ విజై మాల్యా కి ఇపుడు కొత్త కష్టాలొచ్చాయి. విమానాలు నడుపుకొనే వ్యాపారంలో అడుగు పెట్టి విపరీతమైన నష్టాలు రావడంతో తన పాత వ్యాపారమైన కింగ్‌షిషర్‌ బీర్లు అమ్మకాలతో నెట్టుకొస్తున్నాడు.
తెలంగాణలో వివిధ బ్రాండ్ల బీరు అమ్మకాల్లో కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ కే ఎక్కువ డిమాండ్‌ ఉంది. అయితే ఇటీవల ఎవరైనా సరే సొంతంగా వాటర్‌ ప్లాంట్‌లాగా బీర్‌ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకునే వెసులబాటును మైక్రో బ్రూవరీలు రూపంలో తెలంగాణ సర్కారు కల్పించబోతుంది. రూ.కోటిన్నర ఉంటే ఎవరైనా గల్లీల్లో కూడా సొంతంగా బీరు ప్లాంట్‌ పెట్టుకోవచ్చు. సొంత బ్రాండ్లతో సీసాల్లో కాకుండా మగ్గుల్లోనే తాగడానికి అనువుగా అతి తక్కువ రేటుకే బీరు తయారవుతుంది. దీని కోసం ‘మైక్రోబ్రేవరీ రూల్స్‌ … 2015’ పేరుతో తెలంగాణ రాష్ట్ర సర్కారు జీవో( నెం.151) జారీ చేసింది.దీంతో వందలాది లోకల్‌ బ్రాండ్లు హైదరాబాద్‌లో సందడి చేయబోతున్నాయి. ఇప్పటి వరకు బీరు ప్రియులను దాహం తీర్చిన కింగ్‌ఫిషర్‌ కు కాలం చెల్లబోతుంది.
ఈ తెలంగాణ బీరు ప్లాంట్‌ల సంగతి తెలిసినప్పటి నుండి విజై మాల్యాకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. తెలంగాణాలో తన బీరుకు ఇక గిరాకీ ఉండదని ఆందోళన చెందుతూ ఈ నష్టం నుండి బయట పడటం కోసం తాము కూడా డ్రాట్‌ బీరు సరఫరా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు

Share.

Comments are closed.