అడవిలో నాలుగు గంటలు నరక యాతన

Google+ Pinterest LinkedIn Tumblr +

శనివారం(18.5.2019) ఉదయం పదిగంటలు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గోదారి తీర ప్రాంతంలోపి గుట్టల మధ్య ఉన్న అటవీ ప్రాంతమది. వాహనాలు వెళ్లేందుకు సరైన రహదారులు లేవు. అలాంటి చోట బతుకుతున్న ఓ మహిళ తీవ్రంగా జబ్బుపడింది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్‌ లేదు. ఈ దుస్థితిని చూసిన ఓ యువ వైద్యుడు మరో ముగ్గురు గ్రామస్తులను తోడు తీసుకొని రోగిని డోలీ (జెట్టీ) కట్టి మోసుకుంటూ, మండు టెండలో, నాలుగు కిలో మీటర్లు నడిచి , కొత్తగూడెం సమీపంలో ఆంబులెన్ప్‌ దొరకడంతో ఏరియా ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడారు. 

finally reached ambulance


పాల్వచ మండలం, ఉలవనూరు గ్రామ పంచాయితీ పరిధిలోని సిర్ధన పాడు గుంపు(ఆవాసం)లో పాడెం జ్యోతి (25) తీవ్రమైన అనారోగ్యం తో లేవలేని స్దితిలో మంచాన పడింది. ఈ సమాచారం తెలుసుకొన్న ఆ గ్రామ సమీపంలోని గిరిజనులకు వైద్య సేవలందిస్తున్న హోమియో డాక్టర్‌ ఆర్‌.నరేందర్‌ ఆ గ్రామానికి వచ్చి, రోగిని పరీక్షించి, తీవ్రమైన అనారోగ్యంతో ఉందని గ్రహించి, సరైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లాలని సలహా ఇచ్చాడు. గ్రామం నుండి బయటకు రావడానికి దారి లేదని, స్ధానికులు చెప్పటంతో, డాక్టర్‌ ఆర్‌.నరేందర్‌ జెట్టీ కట్టి, నాలుగు కిలోమీటర్లు నడిచి ప్రధాన రహదారికి తీసుకొచ్చి, అక్కడి నుంచి ఆంబులెన్స్‌లో కొత్తగూడెం ఆసుపత్రిలో చేర్పించి, జ్యోతి ప్రాణాలు కాపాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ,అర్లపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లోని మారుమూల అటవీప్రాంతంలో గొత్తికోయలకు గుంపులుగా జీవిస్తున్నారు. వీరు ఛత్తీస్‌గఢ్‌ నుంచి బతుకుదెరువు కోసం నాలుగు దశాబ్దాల క్రితమే వలస వచ్చారు. ఈ ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేవు. 
ఈ సమస్యలను ‘ రూరల్‌మీడియా’ భద్రాచలం ఐటిడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ వి.పి.గౌెతమ్‌ గారి ముందుంచగా. వారిలా స్పందించారు. 
ప్రభుత్వం గొత్తి కోయలకు అండగా ఉంటుంది 
” గొత్తి కోయల ఆవాసాలకు ఇరవై సైకిల్‌ ఆంబులెన్స్‌లు ఇస్తున్నాం. వారుంటున్న గ్రామపంచాయితీలలో కమ్యూనిటీ హాల్స్‌ నిర్మిస్తున్నాం. దానిలోనే, ఆరోగ్యకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తాం. వాగుల్లో నీరు తాగడం వల్ల వారు అనారోగ్యం పాలవుతున్నారని డాక్డర్‌ నరేంద్ర కూడా మా దృష్టికి తెచ్చారు. ప్రతీ ఆవాసంలో తాగునీటి బావులు నిర్మిస్తూ , పిల్లలకు పౌష్టికాహారం అందించి, వీలైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం.” అని అన్నారు. – shyammohan

Share.

Leave A Reply