దిక్కులేని కుటుంబానికి ‘దివ్య’మైన దారి

Google+ Pinterest LinkedIn Tumblr +

దిక్కులేని కుటుంబానికి ‘దివ్య’మైన దారి
భర్త ఎక్స్‌గ్రేషియా కోసం అధికారుల చుట్టూ తిరిగీ తిరిగీ అలసి పోయి, సొమ్మసిల్లి పడిపోయిన బుజ్జమ్మకు కిసాన్‌ మిత్ర హెల్ప్‌లైన్‌ పోస్టర్‌ కనిపించింది. ఆఖరి ఆశగా కాల్‌ చేసింది.

గంటలోనే ఆమె గుమ్మం ముందు రైతు స్వరాజ్యవేదిక కార్యకర్త సంగమేష్‌ ప్రత్యక్షమయ్యాడు.
ఆమెకు భవిష్యత్‌ గురించి కాస్త నమ్మకం కలిగించాడు. బైండ్ల బుజ్జమ్మ బతుకు చిత్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
ఆ పేద మహిళ కన్నీటి గాథ కలెక్టర్‌ దివ్యను కదిలించింది. ఆమెను కలెక్టర్‌ ఆఫీసుకు రప్పించి సబ్‌కలెక్టర్‌ సందీప్‌ ద్వారా రూ.5లక్షల ఎక్స్‌ గ్రేషియాను బుజ్జమ్మ పేర బ్యాంకులో డిపాజిట్‌ చేసి 3 నెలలకోసారి వడ్డీ వచ్చేలా ఏర్పాటు చేశారు.

Share.

Leave A Reply