ధ్యానం వల్ల బద్దకం వస్తుందా… ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ధ్యానం, యోగం వల్ల ఙ్ఞానం రాదు. నిద్రవస్తుంది, బద్దకం వస్తుంది, మూర్ఖత్వం వస్తుంది, అనారోగ్యం వస్తుంది. నాడులు బిగించి పట్టుకోవడం వల్లా, శ్వాస నిర్బంధించుకోవడం వల్లా, ఆలోచనా రాహిత్యంలోకి జారిపోవడంవల్లా మేలు కాదు కీడు జరుగుతుంది, నిజానికి ఈ మార్పులు కావాలంటే కష్టపడక్కర్లేదు, సింపుల్ గా చచ్చిపోతే చాలు, పైవన్నీ శరీరానికి వస్తాయి.

శ్వాసని బంధిస్తే ఆక్సిజన్ లెవల్స్ తక్కువై బాడీలోని కణజాలం ఇబ్బంది పడుతుంది, సెల్స్ చచ్చిపోతాయి. మెదడు అదుపుతప్పి స్పృహ కోల్పోతుంది. ప్రాణవాయువు తక్కువవడంవల్ల మెదడులో కలిగే చిత్త బ్రాంతిని ఆత్మదర్శనం, దైవదర్శనం అనీ భ్రమపడతారు కొందరు. యోగం,ధ్యానం వల్ల మనస్సు, శరీరమ్మీద అదుపు, ఆరోగ్యం గట్రా ఏమీ సమకూరవు, అట్లాగైతే అవి చేసిన రామకృష్ణ పరమహంస కేన్సరుతో చనిపోయేవాడు కాదు. యోగపద్దతిగురించి విశేషంగా చెప్పిన, చేసిన వివేకానంద 39సంవత్సరాల వయసుకే 30 పైచిలుకు వ్యాధులతో చనిపోయేవాడు కాదు.

బుద్దుడు కళ్లుమూసుకుని ఆలోచనారాహిత్య స్థితికి వెళ్లిపోలేదు. నిజానికి ఆయన ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చాలా చేసి దాదాపు చనిపోయిన దశలో సుజాత అనే పశువుల కాపరికూతురు ఇంటికి తెచ్చి సపర్యలుచేసి, తిండిపెట్టి మామూలు స్థితికి తెచ్చాక తాను చేసిన తప్పు అర్థమై, రావిచెట్టుకింద కూర్చొని కళ్లుమూసుకుని ఆలోచనారాహిత్య స్థితిని గాక చైతన్య స్థితిని అనుభవిస్తాడు. అదే బుద్దిని ఇస్తుంది బుద్దుడు అవుతాడు.

మనం సమస్యలో వున్నప్పుడు ఆలోచించినట్లు, నిశ్శబ్దంగా కూర్చొని ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తాడు. సమధానం ఆలోచిస్తాడు. అత్యంత లౌకిక విషయం నుండి ఆధ్యాత్మిక, పారమార్థిక విషయాల దాకా ఆలోచిస్తాడు, తరచి చూస్తాడు, సమాధానం రాబట్టుకున్నాడు. ఆ సమాధానాలు ఎంత దుర్బేధ్యంగా వుంటాయంటే దాఇలో ఎడ్లబండిమీద వెళ్లేవాడు అడిగిన సందేహం తీర్చగలదు, యఙ్ఞయాగాదులు చేసిన పండితుల ప్రశ్నలను సమధానపర్చగలదు, ఉపనిషత్తులు చదివిన విద్యార్థికి సమాధానం చెప్పగలదు, అంగుళీమారుడిలాంటి గజదొంగని మార్చగలదు, ఆమ్రపాలివంటి వేశ్యామణిని మార్చగలదు.

కాబట్టి యోగం, ధ్యానం అనే మాటలు బుద్దునికి మనమనుకునే అర్థంలో వర్తించవు. బుద్ధునివి మూసుకున్న కళ్ళు కావు, అర్థనిమీలితాలు, అంటే నిద్రపోతున్నవి కావు, ఆలోచనల్లో మునిగినవి. మనల్ని కళ్ళు తెరిపించేవి.

నేను ఎదుటివాళ్లలో తెలివికి మాత్రమే గౌరవమిస్తాను. కానీ బుద్దుడి తెలివి ఏకంగా భయపెట్టింది. ముఖ్యంగా కర్మ, ఆత్మ, పునర్జన్మ అనే మూడు మాటల్ని దారినపోయే దానయ్యకి అర్థమయ్యేలా చెప్పినప్పుడు. లౌకికవిషయాలపట్ల అవగాహన పెంచుకుటే పెరుగుతుంది, కానీ పారమార్థిక విషయాలపట్ల చాలా కష్టం. దాన్ని నాకు ఒక చిన్న ఉదాహరణతో తీర్చిన గొప్ప గురువు అతడు. అందుకే నేను దైవం అనే బ్రహ్మపదార్థాన్ని, ఆపదం చూట్టూ వున్న మాయని పేలపిండిలా వూదిపడేశాను.

ఈ మూడుపదాల్ని ఒక్కో పోస్టుగా మూడు పోస్టుల్లో రాస్తాను, అతడిచ్చిన చిన్న ఉదాహరణని విడమర్చి. పుస్తకాలపేర్లూ చెబుతాను. బైదిబై నేను రాసిన అన్ని రాతలకన్న విలువైన రాతలుగా రాయడానికి, కొంచెం భయపడుతున్నానుకూడా. స్టే ట్యూన్డ్. – — Siddharthi Subhas Chandrabose

Share.

Leave A Reply