కోడి కూయక ముందే జర్నీ ఉండటంతో, రాత్రి రెండు ఫీచర్ స్టోరీలు పూర్తి చేసి మెయిల్ చేసి పడుకునే సరికి బాగా లేటయింది.ఉదయం వాహనం ఎక్కగానే నిద్రొచ్చింది…
మెలకువ వచ్చేసరికి 7 అయింది. చిక్కని అరటి తోటల మధ్య ఉన్నాం.
ఇదేంటీ కోనసీమలా ఉంది.. అని మదిలో ఫీలింగ్ కలుగుతుంటే…
‘‘ ఇది కోనసీమ కాదు,కోతులాబాద్…’’ అని నవ్వుతూ ఎండిన అరటి ఆకులు కోసి మల్చింగ్ చేస్తూ …తోటలోంచి బయటకు వచ్చాడు రంజిత్.
జనగాం జిల్లా లో ఒక చిన్న గ్రామం. ఒకపుడు చుట్టూ అడవులు ఉండటంతో కోతులు బాగా తిగిగేవని గ్రామానికి వాటి పేరు పెట్టారు.
ఇంటర్ చదివిన రంజిత్ డిగ్రీ పూర్తి చేసినా ఫలితం ఉండదని గ్రహించి తమ బీడు భూమిలో మట్టి పని మొదలు పెట్టాడు. చుట్టూ అంతా పత్తి,జొన్న పండిస్తుంటే , వాటికి భిన్నమైన పంటలు తన భూమికి
అలవాటు చేయాలని అరటి తోటలు వేశాడు. అంతర పంటగా పసుపు నాటాడు. నీటి వసతి లేక పోయినా డ్రిప్ ఇరిగేషన్ చేసి, చెరువు మట్టి చల్లి, సేంద్రియ ఎరువుతో చక్కని దిగుబడి సాధిస్తున్నాడు. ఎకరాకు ఎవరు ఊహించనంత ఆదాయం ఆర్జిస్తున్నాడు.. అది ఎలాగో అతడి మాటల్లో వినండి…https://youtu.be/7weG5gxkyTc