చింతమడకలో ఒక మెచ్చుతునక !

Google+ Pinterest LinkedIn Tumblr +

కొన్నినెలల క్రితం ముచ్చట ఇది.
సిద్ధిపేట నుండి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది చింతమడక. అది ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వగ్రామం ఇని ఇపుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊర్లోకి వెళ్లే ముందు కేసీఆర్‌ భూముల మధ్య నుండి లోపలికి నడిస్తే, పెండాల్స్‌ పై పొడవైన బీరకాయలు పండిస్తున్న రైతు మల్లన్న కలిశాడు.

” తమ ఫాం హౌస్‌లో కేసీఆర్‌ పండిస్తున్న పంటలు తీరు చూసినంక మేమెందుకు గట్ల ఎవుసాయం చేయ కూడదని, మా బీడు భూమిని సాగులోకి తెచ్చి కూరగాయలు ఆకు కూరలు పండిస్తున్నాం…” అన్నాడు. బోరులో నీళ్లు తక్కువ ఉన్నా ఆందోళన చెందక డ్రిప్‌ ఇరిగేషన్‌తో కాకర, దొండ, బెండ పండిస్తున్నాడు. సాగులో మల్లన్న చేస్తున్న ప్రయోగాలు గురించి తెలుసుకున్న కేంద్ర గ్రామీణాభివద్ది శాఖ వారు ఢిల్లీ పిలిచి అవార్డుతో సత్కరించడంతో చింతమడక మహర్షిగా మారాడు.

అక్కడి నుండి మేం, చింత మడక పంచాయితీ ఆఫీసు దగ్గరకు రాగానే సర్పంచ్‌ లక్ష్మీశేఖర్‌, మరి కొందరు గ్రామస్తులు కనిపించారు. వారు చెప్పిన దాని ప్రకారం…. ఆ గ్రామంలోని రైతులకు సర్కారు నుండి 22 బావులు మంజూరయ్యాయి. పొలాలను లింక్‌ చేస్తూ 15 కిలోమీటర్ల రహదారి వచ్చింది. దీనివల్ల పండిన పంటను సులువుగా మార్కెట్‌కి తరలిస్తున్నారు. 150 మంది రైతుల బీడు భూమికి, 18 ఎకరాల పండ్ల తోటలు పెంపకానికి సాయం చేశారు. ఎస్సీకాలనీకి సిసి రోడ్డు పడింది. కూరగాయల విత్తనాలకు, పెండెల్స్‌కి సబ్సిడీ అందింది.
సరే ఇదంతా సర్కారు తరపున ఆ గ్రామానికి జరిగిన మేలు.


మరి తన సొంత ఊరికి ముఖ్యమంత్రి ఏమైనా చేశారా అని వారిని అడిగినపుడు ఎదురుగా ఉన్న సీఎం సొంత ఇంటిని చూపించారు.
ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక జాతీయ బ్యాంకు బోర్డు కనిపించింది. రూంలో గోడకు కేసీఆర్‌ తల్లిదంఢ్రుల ఫొటొ ఉంది.
బ్యాంకు మేనేజరు సూర్య ప్రకాశ్‌ మాతో కరచాలనం చేసి ఇలా అన్నారు.
” ఇది ఒకపుడు ముఖ్యమంత్రి గారి స్ధలం. దీని పక్కనే ఉన్న పెద్ద భవనం ఆయన ఇల్లు. దానిని ప్రభుత్వ స్కూల్‌ కోసం డొనేట్‌ చేశారు. ఇక్కడ బ్యాంకు పెట్టుకున్నందుకు మేం ఇచ్చే అద్దె కూడా స్కూల్‌కే చెందుతుంది. దానిని వారు పిల్లల చదువుకు ఖర్చు చేస్తారు. ఈ ప్రాంతంలో ఇదే తొలి బ్యాంకు. గ్రామీణాదాయం పెరగడం వల్ల ప్రజలు, రైతుల్లో పొదుపు చేసే శక్తి పెరిగింది. ” అన్నారు.
కేసీర్‌ కుటుంబానికి చెందిన ఇల్లు ఇపుడు స్కూల్‌గా మారింది. ఏడు గదులున్న ఈ భవనంలో 153 మంది పిల్లలు చదువుకుంటున్నారు.వారికి విశాలమైన ఆట స్ధలం కూడా ఉంది. పేదోడి బతుకుని మార్చాలని తపిస్తున్న కేసీఆర్‌ స్వగ్రామంలో పేద పిల్లల చదువు కోసం గొప్ప ప్రయత్నం ఇది. Report /Shyammohan

Share.

Leave A Reply