గిట్టుబాటు ధరను సాధించిన పాలమూరు మట్టి మనుషులు

Google+ Pinterest LinkedIn Tumblr +

పొద్దు పొడవక ముందే లేచి,వాకిలి ఊడ్చి,పేడనీళ్లు చల్లి,ముగ్గులేసి, నాలుగు ముద్దలు వండి,కాడెద్దులను తోలుకొని,భర్తవెనుకే పొలానికి వెళ్లి ,కలుపు తీసి, పురుగుమందులు కొట్టి, పచ్చగా ఎదుగుతున్న పైరుకు దిష్టి తగల కుండా గట్లమీద బంతిపూల మొక్కలు పెంచి, పంట చేతికి వచ్చాక, పరవశం తో పాడుతూ కోస్తుంటే … ”ఇగో లచ్చుమమ్మా .. కోసిన పంటను ఏదో ధరకు మాకివ్వు.. హెచ్చులకు పోకు, అగో మబ్బులు వస్తున్నాయి, మునిగి పోతావు..” అని సేట్‌ బెదిరించగానే… ” గట్లనే దొరా ఎంతో కొంత ఇచ్చి తీసుక పోండ్రి.. ఎరువులకు చేసిన అప్పులన్నా తీరుతవి…” అని పైట కొంగుతో కన్నీళ్లను, చెమటను తుడుచుకునే ఒకప్పటి రైతమ్మలు కాదు వీరు. తాము పండించిన ప్రతీ గింజకు విలువ ఉందని, దానికి తగిన రేట్‌ ఇవ్వాలని మార్కెట్‌ని శాసించి గిట్టుబాటు ధరను సాధించిన పాలమూరు మట్టి మనుషులు. అలాంటి యోధులతో కలిసి నడుస్తూ… తీసిన డాక్యుమెంటరీ ఇది..https://youtu.be/mvISYLrkNgg

అరుదైన గ్రామీణ విజయ గాథలు,  పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia  తెలుగు ఛానల్ ని  జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber  మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply