ఒక అమ్మ కథ

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎకరంన్నరలో, మట్టితో సావాసం చేసి, సగం చిక్కుడు.సగం మక్కలు పండించుకుంటూ బతికింది, ఈ లచ్మమ్మ. సంతానం లేదని దిగులు పడలేదు … ఒక పేద బిడ్డను తెచ్చుకొని చిక్కుడు పాదులు పెంచినట్టు సాకింది. వాడు ఎదిగి ఆ పొలాన్ని ఆరెకరాలు చేసి అమ్మను గుండెల్లో దాచుకున్నాడు. ఇపుడు, ఇద్దరు మనవలు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తూ , రెండు రోజులకో సారైనా ఈ ముసలమ్మను పలకరిస్తుంటారు.

ఎవరి సాయం లేకుండా తన పనులు తానే చేసుకునే ఆమె వయస్సు 90దాటింది.
నిన్న,వట్టిమీనపల్లి(vikarabad district) లో ఆమె క్యాబేజీ సాగు చూశాక, ‘జొన్న రొట్టెలు,ముల్లంగి కూర చేసిన, తింటవా అయ్యా …’ అని అప్యాయంగా పలకరించి, తన గత జీవన చిత్రాన్ని వివరించింది.

ఆ తల్లితో మాట్లాడితే సమయం వృధాకాదు. కానీ, ఆమె గూట్లో దీపం లాంటిది!!

Share.

Leave A Reply