అసురన్ ఒక అద్భుతం

Google+ Pinterest LinkedIn Tumblr +

★ తమకు నచ్చని కులానికి చెందిన అమ్మాయి చెప్పులు వేసుకుందనే కారణం తో అవే చెప్పులు తన నెత్తిమీద పెట్టి ఊరంతా ఊరేగిస్తారు, ఇది తెలిసిన అసురన్ లాయర్ అయిన తన అన్నకు విషయం చెప్పి న్యాయపోరాటం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేస్తాడు..

★ ఆత్మగౌరవ పోరాటంలో సర్వం కోల్పోయిన అసురన్ వేరే ఊర్లో స్థిరపడతాడు తనకున్న చిన్న కమతం మీద గ్రామపెద్దల కన్ను పడిందని అంతే కాకుండా పెత్తందారుకి చెందిన వందల ఎకరాల భూమి చుట్టూ ప్రమాదకరంగా కరెంట్ ఫెన్సింగ్ వేసిన విషయాన్నీ, తనకు చెందిన బాయి నుండి అక్రమంగా నీళ్లు వాడుకుంటున్న విషయాన్ని  రెవెన్యూ ఉద్యోగిగా ఉన్న పెద్ద కొడుకు దృష్టికి తెచ్చి న్యాయంగా తనకు రావాల్సిన భూమి ని నీటివనరులను చట్ట ప్రకారం పొందుతాడు.. 

 ◆ భూ తగాదా లో తన పెద్ద కొడుకుని కోల్పోయిన చదువుకున్న అసురన్ తను మద్యానికి బానిస కాకుండా, తనలాగే వర్గపోరులో నష్టపోయి పోలీసు వ్యవస్థలో నిజాయితీగా పనిచేస్తున్న అధికారి సాయంతో కొడుకు చంపించిన వారికి శిక్ష పడేలా చేస్తాడు,తన చిన్న కొడుకు ను బాగా చదివించి ఉన్నత ఉద్యోగిగా చేస్తాడు..

◆ భూ తగాదా కుటుంబాల మధ్య పగగా మారడం, మైనర్ అయిన తన చిన్న కొడుకు నేరస్తుడుగా మారడంతో  మీడియా, న్యాయ వ్యవస్థల లో ఉన్న తనవారి ద్వారా బలమైన పెత్తందారులను ఎదిరించి తన చిన్న కొడుకును సరెండర్ చేసి తన కుటుంబాన్నీ, భూమినీ రక్షించుకుంటాడు..

 ◆ పైన చెప్పిన ఏ సందర్భంలో అయినా అసురన్ వైపు విద్య ఉండి ఉంటే అసురన్ కుటుంబం అన్యాయానికి గురికాకుండా ఉండేది. అంబెడ్కర్ అయినా భాగ్యరెడ్డి వర్మ అయినా నేటి ప్రవీణ్ కుమార్ అయినా, పగనూ వర్గపోరునూ కోరుకోలేదు విద్యను, వికాసాన్ని తద్వారా వచ్చే సమసమాజాన్ని కోరుకున్నారు. 

ఈ సినిమాలో లో చెప్పే మాటలు చాలా మంది ఇప్పటికి చాలా సార్లు చెప్పారు, కానీ సినిమాలో మాటల విలువ సినిమా చూసిన వారికి అర్ధం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఉంది చూడండి.

 – Om Prasad

Share.

Leave A Reply