శ్రీసిటీ గ్రామాల ప్రజల ఆదాయం రెండింతలు పెరిగింది.

Google+ Pinterest LinkedIn Tumblr +

శ్రీసిటీ గ్రామాల ప్రగతిపై సర్వే విడుదల

శ్రీసిటీ, మార్చి 29, 2021:

శ్రీసిటీ పరిధి గ్రామాల ఆర్ధిక-సామాజిక ప్రగతిపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ బృందం నిర్వహించిన సర్వే నివేదిక విడుదల కార్యక్రమం సోమవారం శ్రీసిటీలో జరిగింది. స్థానిక బిజినెస్ సెంటర్ లో ఏర్పాటుచేసిన స్థానిక విలేకర్ల సమావేశంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి లాంఛనంగా దీనిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ప్రముఖ రచయత ఎం.భూమన్, సీనియర్ పాత్రికేయులు, సాహితీవేత్త ఉమామహేశ్వరరావ్ ముఖ్యఅతిదులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కె.రాజారెడ్డి మాట్లాడుతూ, నేడు ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీసిటీ అభివృద్ధిని నేరుగా వీక్షించానని, అభివృద్ధి అబ్బురపరిచేలా ఉందన్నారు. ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో శ్రీసిటీ పరిసర గ్రామాల ప్రగతిపై చేసిన సర్వే వాస్తవ దృక్పథానికి చాలా దగ్గరగా ఉందన్న ఆయన, నివేదికలోని పలు ప్రధానాంశాలను చదివి వినిపించారు. 
ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ, ఏ సంస్థ అభివృద్దికైనా సర్వేలు, గణాంకాలు చాలా అవసరమన్నారు. ఈ కోవలో శ్రీసిటీ చొరవ ప్రశంసనీయమన్నారు. శ్రీసిటీ పరిధి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి నిష్పక్షపాత సర్వేలు చేయించి, అందుకు అనుగుణంగా తమ పనితీరును మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నందుకు శ్రీసిటీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే పలు గ్రామాభివృద్ధి  చేపడుతోందన్న ఆయన, మరింత మెరుగైన అభివృద్ధికి పలు సూచనలు చేశారు. 

శ్రీసిటీ భూసేకరణ సమయంలో పలు అనుమానాలతో  శ్రీసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలు కథనాలు వ్రాసానని, నేడు నా ఆలోచనలు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విదేశీ ప్రరిశ్రమలతో దేశానికే తలమానికంగా అబ్బుర పరిచే అభివృద్ధి శ్రీసిటీ సొంతమైందని, ఇది ఎవరూ కాదనలేని సత్యమని వ్యాఖ్యానించారు. శ్రీసిటీ ఎన్నో పర్యావరణ హిత చర్యలు తీసుకుంటున్నా, పర్యావరణ సమతుల్యం దిశగా కొంత భూమిలో సేంద్రియ వ్యవసాయం చేసే ఆలోచన చేయాలని సూచన చేశారు. 
వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి తలమానికం శ్రీసిటీ అంటూ భూమన్ అభివర్ణించారు. రాయలసీమ అభివృద్ధికి శ్రీసిటీ లాంటి ప్రాజెక్ట్ జిల్లాకు ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. 28 దేశాల పరిశ్రమలు ఇక్కడ కొలువుతీరడం వెనుక శ్రీసిటీ యాజమాన్యం శ్రమ, కృషిని ఆయన అభినందించారు. శ్రీసిటీ పరిధి గ్రామాలపై ఎస్వీ యూనివర్సిటీ బృందం చేసిన సర్వే ఎంతో ఆసక్తికరంగా, వాస్తవికతకు చాలా దగ్గరగా ఉందన్న ఆయన, ఇదే రీతిలో శ్రీసిటీ బయట ఇతర ప్రాంతాల అభివృద్ధిపై కూడా శ్రీసిటీ ప్రభావాన్ని సర్వే చేయాలని సూచించారు. 
సర్వే నివేదిక చాలా సంతృప్తికరంగా ఉందని, అలాగే పలువురు ప్రముఖులు దీని విడుదల కార్యక్రమానికి విచ్చేయడం, వారి అభిప్రాయాలను వెలిబుచ్చడం ఆనందంగా ఉందన్నారు. నివేదిక సూచనల మేరకు మరింత చిత్తశుద్ధితో పరిసర గ్రామాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 

కాగా, ఎస్వీ యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో 3 నెలల క్రితం శ్రీసిటీ 18 గ్రామాలలో ఈ సర్వే నిర్వహించారు. సర్వే నివేదిక ప్రధానాంశాల మేరకు గ్రామాలలో కేవలం ఒక్క శాతం వారికి మాత్రమే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇంకా కల్పించబడలేదని తెలిపారు. గత పదేండ్లలో ఇక్కడ ప్రజల ఆదాయం రెండింతలకు మించి ఉందన్నారు. ఆర్ సీ సీ ఇండ్ల నిర్మాణాలు గణనీయంగా పెరిగాయన్నారు. క్రైమ్ రేట్ చాలా తగ్గిందని పేర్కొన్నారు. పరిసమాల్లో మహిళలకు వేధింపుల శాతం సున్నాగా తెలిపారు. గృహ హింస బాగా తగ్గుముఖం పట్టిందని అన్నారు. నీరు, గాలి నాణ్యత పెరిగాయన్నారు. విద్య, వైద్యం, రోడ్డు సౌకర్యాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. 

Share.

Leave A Reply