రాయలసీమలో,రఫేల్ విమానం!!

Google+ Pinterest LinkedIn Tumblr +

( D. Ravi )
పలు దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమలకు నెలవైన శ్రీసిటీ, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఎపి’ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు కీలక జాతీయ ప్రాజెక్టులలో  భాగస్వామిగా తమ ఉత్పత్తులను అందిస్తోంది. ప్రస్తుతం దేశం గర్వించదగ్గ డసాల్ట్-రఫేల్ యుద్ధ విమానాల ప్రాజెక్టులోను శ్రీసిటీకి చెందిన  రెండు పరిశ్రమలు భాగస్వామ్యులు కావడం శ్రీసిటీ అభివృద్ధిలో మరో మైలురాయిగా పేర్కొనవచ్చు. 
శ్రీసిటీలోని హంటర్ డగ్లస్ ఇండియా పరిశ్రమ ద్వారా రఫేల్ విమానాలు కొలువుతీరే సర్వీస్ హ్యాంగర్ మెటల్ పైకప్పును (ఫాల్స్ సీలింగ్) ఏర్పాటు చేయగా, సిద్ధార్థ లాజిస్టిక్స్ పరిశ్రమ తన ఆధునిక గిడ్డంగిలో డసాల్ట్-రఫేల్ ప్రాజెక్టుకు చెందిన పలు విడిభాగాలను భద్రపరిచి సరఫరా చేస్తోంది. 
హంటర్ డగ్లస్ గ్రూప్ కు చెందిన హంటర్ డగ్లస్ ఇండియా లిమిటెడ్, లుక్సలోన్ బ్రాండ్ పేరుతో శ్రీసిటీలో ఆర్కిటెక్చరల్ ప్రొడక్ట్స్ తయారీకి అత్యాధునిక ఉత్పత్తికేంద్రాన్ని కలిగి ఉంది. గ్రౌండ్ సపోర్ట్ సదుపాయాలను సిద్ధం చేయడంలో భాగస్వామిగా హంటర్ డగ్లస్ పంజాబ్‌లోని అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో రఫేల్ ఫైటర్ జెట్ హ్యాంగర్ కోసం ‘లుక్సలోన్ 300 సి’ లీనియర్ మెటల్ పైకప్పును విజయవంతంగా సరఫరా చేసింది. 
శ్రీసిటీలోని ఫ్రీట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్‌లో ఉన్న సిద్ధార్థ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, డసాల్ట్ ఫ్రాన్స్‌కు సంబంధించిన విడి భాగాలను తన గిడ్డంగిలో భద్రపరుస్తుంది. సిద్ధార్థ లాజిస్టిక్స్ సంస్థ భారతదేశంలో డిఫెన్స్ ఆఫ్‌సెట్ లాజిస్టిక్స్ పరిశ్రమగా గుర్తించబడి, అనేక విదేశీ రక్షణ పరికరాల సరఫరాదారులు తమ ఉత్పత్తి సామగ్రిని ఇక్కడ నిల్వ ఉంచుతారు. డసాల్ట్ ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ మరికొన్నింటితో సహా అనేక రక్షణ పరిశ్రమ తయారీదారులకు ఇది తన గిడ్డంగి సేవలను అందిస్తుంది. ఆఫ్‌సెట్ లాజిస్టిక్స్ యొక్క ఈ కొత్త వ్యవస్థ రక్షణ పరిశ్రమ లో విడిభాగాల  సరఫరాను మెరుగుపరచడానికి, తక్కువ ఖర్చుతో దేశ విదేశాలకు పరికరాల సరఫరాతో పాటు సమయాన్ని ఆదా చేయడంలో దోహదపడుతోంది. 

sri city rafeal

ఆర్థిక వ్యవస్థ వృద్ధి… డసాల్ట్ రఫేల్ విమాన ప్రాజెక్టుతో తమ అనుబంధానికి గర్విస్తున్నామంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతర మద్దతు ప్రోత్సాహంతో, దేశ ఆశయాలకు అనుగుణంగా ఉత్పాదక కేంద్రంగా, ఉద్యోగాల కల్పన, ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధన దిశగా వేగంగా పయనం సాగిస్తూ శ్రీసిటీ దేశంలోని మెగా ఇండస్ట్రియల్ పార్కులలో ఒకటిగా అవతరించిందన్నారు.శ్రీసిటీలోని వీఆర్వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ క్రయోజెనిక్ ట్యాంకులను తయారుచేసి, ఇస్రోలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డిఎస్‌సి) షార్‌కు లిక్విడ్ హైడ్రోజెన్  నిల్వలకు ఆ ట్యాంక్‌లను సరఫరా చేస్తుందోన్నారు. గతంలో ఈ ట్యాంకులు దిగుమతి చేసుకునేవారని తెలిపారు. కోవిడ్ మహమ్మారి పోరాటంలో భాగంగా, పాల్స్ ప్లష్, విఆర్వి ఆసియా పసిఫిక్, వైటల్ పేపర్, టిఐఎల్ హెల్త్‌కేర్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను అందించాయని గుర్తుచేశారు. అధిక నాణ్యత గల వ్యక్తిగత రక్షణ సామగ్రి (పిపిఇ) కిట్‌ల నుండి ప్రాణాలను రక్షించే ఔషధాల వరకు, అత్యవసర హాస్పిటల్ బెడ్లు నుండి మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు వరకు సరఫరా చేశాయన్నారు. దేశ ప్రగతి, భద్రతకు అవసరమైన అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావడానికి శ్రీసిటీ పారిశ్రామిక కుటుంబం ఆసక్తిగా ఎదుచూస్తుందని ఆయన పేర్కొన్నారు. 

photo/ హంటర్ డగ్లస్ ఏర్పాటు చేసిన ‘లుక్సలోన్ 300 సి’ పైకప్పు కలిగిన భవనంలో  రఫేల్ విమానం 

Share.

Leave A Reply