ఇళ్లకు చేరుకున్న వలస కార్మికులు

Google+ Pinterest LinkedIn Tumblr +

 

పలు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం శ్రీసిటీకి వచ్చిన వలస కార్మికులు కరోనా నేపథ్యంలో తమ స్వస్థాలకు వెళ్లేందుకు ఉపక్రమించారు. వారి అభీష్టం మేరకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, శ్రీసిటీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేపట్టడంతో కార్మికులంతా క్షేమంగా తమ రాష్ట్రాలకు చేరుకున్నారు. చివరగా వెస్ట్ బెంగాల్ కు  చెందిన 363 మంది ఆదివారం ఉదయం ప్రత్యేక బస్సులలో చిత్తూరు వెళ్లి, అక్కడ నుంచి శ్రామిక్ రైలులో తమ రాష్ట్రానికి బయల్దేరి వెళ్లారు. స్వగ్రామాలకు చేరుకున్న తరువాత వారంతా మొదట 14 రోజులు ప్రభుత్వ క్వారెంటైన్ లో, ఆ తరువాత 14 రోజులు హోం క్వారెంటైన్ లో వుండాలని అధికారులు సూచించారు. ఈ మేరకు తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్న 1240 మంది స్వస్థలాలకు వెళ్లారు. వీరికి ప్రయాణంలో అవసరమైన ఆహారం, త్రాగునీరు, శానిటైసర్ బాటిల్, మాస్కులను శ్రీసిటీ సిబ్బంది అందించారు.

ఈ సందర్భంగా, రెండు నెలలు తమ బాగోగులు చూసి, అన్ని వసతులు కల్పించిన శ్రీసిటీ యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన వలస కార్మికులు, సాదారణ పరిస్థితులు నెలకొన్న తరువాత మళ్ళీ శ్రీసిటీకి తిరిగివస్తామని తెలిపారు.

ఏండ్ల తరబడి  నిర్మాణ పనుల్లో..

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛతీస్ గడ్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా ఇలా పలు రాష్ట్రాల నుంచి 2 వేల మందికి పైగా వలస కార్మికులు ఏండ్ల తరబడి శ్రీసిటీలో పరిశ్రమల భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పరిశ్రమల పరిసరాల్లోనే వీరికి ప్రత్యేక భోజన, బస ఏర్పాట్లు చేసి,శ్రీసిటీ యాజమాన్యం వీరి బాగోగుల కోసం ప్రత్యేకమైన శ్రద్ద తీసుకుంటోంది.

లొక్డౌన్ లోను ప్రత్యేక వసతులు..

కరోనా లొక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా పలు చోట్ల వలస కార్మికులు బ్రతుకు జీవనం కరువై తమ స్వస్థాలకు చేరేందుకు నానా అగచాట్లు పడ్డారు. అయితే శ్రీసిటీలో కార్మికులకు యాజమాన్యం అండగా ప్రత్యేక వసతులు కల్పించింది. నిర్మాణ పనులు ఆగిపోయినప్పటికీ, సంబంధిత కాంట్రాక్టర్లు, పరిశ్రమల ప్రతినిధులతో నిరంతరం చర్చిస్తూ కార్మికులకు భోజన, బస ఏర్పాట్లులో పాటు వారి ఆరోగ్య రక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి, వారి సహకారంతో విడతల వారీగా అందరిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారివారి స్వరాష్ట్రాలకు సాగనంపారు. కార్మికుల స్పందన… ‘రెండేళ్ల నుంచి శ్రీసిటీలో పనిచేస్తున్నాను. ప్రతి రెండు నెలలకు ఓ సారి ఇంటికి వెళ్ళేవాడిని.  కరోనా లొక్డౌన్ నేపథ్యంలో ఇంటికి వెళ్ళలేకపోయాను. రాష్ట్ర ప్రభుత్వం, శ్రీసిటీ యాజమాన్యం  మంచి ఏర్పాట్లు చేసి ఖర్చు లేకుండా ఉచితంగా మా ఇంటికి పంపారు.  లొక్డౌన్ సమయంలోను శ్రీసిటీ వారు, మా కాంట్రాక్టరు ఏ లోటు లేకుండా మమ్మల్ని చూసుకున్నారు.’ – వేదప్రకాష్సింగ్కృషినగర్ ఉత్తరప్రదేశ్

కార్మికుల సంక్షేమం పట్ల నిబద్ధతను చాటుకున్న యాజమాన్యం..                                                 ‘ఏవిధమైన గొడవలు, సమస్యలు లేకుండా, ప్రభుత్వ  ఆరోగ్య నిబంధనల ననుసరిస్తూ  వలస కార్మికులను సొంత ప్రాంతాలకు పంపే కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేసి,  కార్మికుల సంక్షేమం పట్ల  తమ నిబద్ధతను శ్రీసిటీ యాజమాన్యం చాటుకుంటూ ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి  అభినందనలు.’
– కోనేటిఆదిమూలంఎమ్మెల్యేసత్యవేడు

‘వలస కార్మికులు సురక్షితంగా తమ స్వస్థలాలకు  తరలించేందుకు సహకరించిన ప్రభుత్వ  యంత్రాంగం ముఖ్యంగా రెవిన్యూ, పోలీసు అధికారులకు  ధన్యవాదాలు . ఇందుకోసం శ్రమించిన శ్రీసిటీ సెక్యూరిటీ  సిబ్బంది కి అభినందనలు. నిర్మాణ పనులలో వలస కార్మికులే కీలకం.. వెళ్లిన వారంతా మళ్లీ శ్రీసిటీకి వస్తామని చెప్పడం  సంతోష దాయకం. ‘
– రవీంద్రసన్నారెడ్డిఎండీశ్రీసిటీ

శ్రీసిటీ యాజమాన్యం సూచన మేరకు తమ సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసుల సహకారంతో  శ్రీసిటీలోని వలస కార్మికులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నాము.  ఇక్కడ సుమారు 2 వేల మందికి 16 వేర్వేరు ప్రాంతాలలో బస కల్పించి,  రోజు వారి బాగోగులను పర్యవేక్షించాము. సంబంధిత కాంట్రాక్టర్లతో నిత్యం చర్చిస్తూ  ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే స్పందించాము.  అలాగే సంతోషంగా  వారి స్వరాష్ట్రాలకు తరలివెళ్లే ఏర్పాట్లు చేశా ము… అని,
శ్రీసిటీ సెక్యూరిటీ ఇంచార్జి రమేష్ అన్నారు . ( Report/ D. Ravi )Share.

Leave A Reply