కోవిడ్ బాధితులకు శ్రీసిటీ ఆక్సిజన్

Google+ Pinterest LinkedIn Tumblr +

 2008 లో వీఆర్‌వీ పరిశ్రమ నిర్మాణ శంకుస్థాపన దృశ్యాలు

  • అది 2008 ఆగస్టు 8.
    చిత్తూరు జిల్లా , తడ సమీపంలోని శ్రీసిటీ పారిశ్రామిక పార్క్‌.
    దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరెడ్డి చేతుల మీదుగా ఆ రోజు ఆక్సిజన్‌ ట్యాంకు ఉత్పత్తి చేసే వీఆర్వీ పరిశ్రమ శంకుస్థాపన జరిగింది.
    సీన్‌ కట్‌ చేస్తే, ఇపుడు రాజశేఖరెడ్డి తనయుడు వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. శ్రీసిటీలో ప్రఖ్యాత పారిశ్రామిక యూనిట్లు కొలు వు తీరి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదే వీఆర్వీ కంపెనీ నుండి 10 వేల లీటర్ల ఆక్సిజన్‌ని కరోనా బాధితులకు అండగా తిరుపతి స్విమ్స్‌కు విరాళంగా (29.4.2021న)ఇచ్చారు.

శ్రీసిటీ, ఏప్రిల్ 29, 2021: 
కరోనా భాదితులకు సాయంగా శ్రీసిటీ యాజమాన్యం తిరుపతి స్విమ్స్ కు 20 లక్షల రూపాయల విలువైన 10 వేల  లీటర్ల సామర్థ్యం కలిగిన మెడికల్ ఆక్సిజన్ ట్యాంకును గురువారం విరాళమిచ్చింది. జిల్లాలో కోవిడ్ రిఫెరల్ ఆసుపత్రిగా గుర్తించబడిన శ్రీ పద్మావతి ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ నిల్వచేసేందుకు దీనిని వినియోగిస్తారు. ఇప్పటికే 3 ఆక్సిజన్ ట్యాంకులను ఇక్కడ కరోనా రోగుల చికిత్సకు వినియోగిస్తున్నారు. ఇక్కడ మరో ట్యాంకు అవసరముందని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి  నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ హరినారాయన్, వెంటనే ట్యాంకు ఏర్పాటు కోసం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డితో చర్చించి సాయం కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం కూడా ఎండీని కోరారు. 


దీనిపై స్పందించిన శ్రీసిటీ ఎండీ, యుద్ధప్రాతిపదికన ట్యాంకు ఏర్పాటుకు ముందుకొచ్చారు. 10 వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకును తక్షణం సరఫరా చేయాలని శ్రీసిటీలోని వీఆర్వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యాన్ని ఆయన అభ్యర్థించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్ గా స్పందించిన వీఆర్వీ సంస్థ వెంటనే ట్యాంకును ఉత్పత్తి చేసి సరఫరా చేసింది. 
దేశ వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో రోగులు శ్వాస అందక అవస్థలు పడుతున్న ప్రస్తుత తరుణంలో జిల్లా యంత్రాంగానికి తోడుగా స్విమ్స్ కు ఆక్సిజన్ ట్యాంకు సరఫరా చేయడం తమ భాద్యతగా భావిస్తున్నామంటూ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. ఈ ఆక్సిజన్ ట్యాంకులు ఉత్పత్తి చేస్తున్న వీఆర్వీ పరిశ్రమ నిర్మాణానికి 2008 ఆగస్టు 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరెడ్డి చేతుల మీదుగా అప్పటి ఎమ్మెల్యే నారాయణస్వామి సమక్షంలో శంకుస్థాపన జరిగిందని గుర్తుచేసిన ఆయన, వైఎస్సార్ జ్ఞాపకార్థం ఈ ట్యాంకును విరాళంగా ఇస్తున్నామన్నారు. 
కరోనా విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించిన ఆయన, ఈ ప్రయత్నాన్ని మరింత బలోపేతం చేయడానికి, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని సమర్ధవంతమైన నాయకత్వంలో మనం ఈ కరోనా మహమ్మారి నుండి సురక్షితంగా తప్పక బయట పడతామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

కాగా, శ్రీసిటీలోని అమెరికాకు చెందిన వీఆర్‌వీ ఆసియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ, దేశంలో క్రయోజెనిక్ స్టోరేజ్ సిలిండర్లు, ట్యాంకులు తయారుచేసే మూడు కంపెనీలలో ఒకటి. దేశంలో ఆక్సిజన్ ట్యాంకర్లు మరియు సిలిండర్ల కొరతను తీర్చడానికి ప్రస్తుతం విఆర్వి మూడు షిఫ్టులలో పనిచేస్తోంది. నెలకు 150 క్రయోజెనిక్ సిలిండర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.  ఇది వివిధ ఆసుపత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్లను సరఫరా చేస్తుంది. ప్రస్తుతం దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. 
Sri City donates Oxygen storage tank to SVIMS

Share.

Leave A Reply