శ్రీసిటీ – 2020

Google+ Pinterest LinkedIn Tumblr +

2020లో శ్రీసిటీ ప్రగతి :-  మే నెలలో, భారత ప్రభుత్వ జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక మరియు సదుపాయాల సంస్థ ‘ఇన్వెస్ట్ ఇండియా’, ‘భారతదేశంలో తయారీకి గొప్ప ప్రదేశాలు’ పేరుతో విడుదల చేసిన ఓ ప్రచురణలో శ్రీసిటీ ప్రాంతాన్ని తయారీ రంగంలో దేశంలోని పది గొప్ప ప్రదేశాలలో ఒకటిగా గుర్తించింది.

 •  నాణ్యత, పర్యావరణ హిత వ్యవస్థల ఉత్తమ నిర్వహణకు గాను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) నుండి  ISO 9001:2015, ISO 14001: 2015 ధ్రవీకరణ పత్రాలు శ్రీసిటీకి వచ్చాయి. 
 • – భారీ పారిశ్రామిక భద్రతా వాకతాన్ నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది.
 •  – అధికారుల సూచనల మేరకు అన్ని కరోనా నివారణ చర్యలను కఠినంగా అమలు చేయడంతో శ్రీసిటీ ‘కరోనా-ఫ్రీ-జోన్’ గా గుర్తింపు సాధించింది.
 •  – కరోనా లాక్డౌన్ సమయంలో దూరప్రాంతాల నుండి వచ్చిన వలస కార్మికులు మరియు మహిళా ఉద్యోగులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపడం జరిగింది.  
 • – నగదు ఇతర పలు రకాల విరాళాల ద్వారా కోవిడ్ వ్యతిరేక పోరాటంలో ప్రభుత్వానికి సహకారం అందించింది.
 •  – ప్రభుత్వం, ముఖ్యంగా పరిశ్రమలు, పోలీసు డిపార్ట్మెంట్, జిల్లా అధికారులు అందించిన అద్భుతమైన సహకారంతో శ్రీసిటీలో చాలా త్వరగా పనులు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
 •  – కరోనా సమయంలో పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి, కార్మిక మంత్రి జి.జయరాం సందర్శనలు శ్రీసిటీకి మరింత ధైర్యాన్ని పెంచాయి.
 • – చిత్తూరు, నెల్లూరు, తిరువల్లూరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్ల సందర్శనలు శ్రీసిటీలో పారిశ్రామిక కార్యకలాపాలను త్వరగా ప్రారంభించడానికి దోహదపడ్డాయి.
 • – ఆత్మనిర్భర్ శ్రీసిటీ సాధనలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు.మొత్తం రూ. 1,158 కోట్ల పెట్టుబడి, 2,400 మందికి ఉద్యోగాల కల్పన సామర్థ్యంతో 7 కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయులు జరిగాయి.
 • -2020 సంవత్సరంలో శ్రీసిటీ సెజ్ పరిశ్రమల మొత్తం ఎగుమతి విలువ – రూ. 2,505 కోట్లు. 4 కొత్త కంపెనీలు నిర్మాణ పనులను ప్రారంభించాయి.
 • 9 పరిశ్రమలు ఉత్పత్తుల దశలోకి ప్రవేశించాయి.  – ‘టాప్ 100 సీనియర్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ ఇన్ ఇండియా’ అవార్డు, ‘ఐకానిక్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్’ & ‘సిఎఫ్‌ఓ ఆఫ్ ది ఇయర్’ జంట అవార్డులు, మరియు బ్రాండ్ స్టోరీ సంస్థ వారి భారతదేశపు ప్రముఖ బ్రాండ్ -2020 అవార్డు ఈ ఏడాదిలో శ్రీసిటీని వరించాయి. 
Share.

Leave A Reply