వేట నుండి వెలుతురు కిరణం వైపు

Google+ Pinterest LinkedIn Tumblr +

వేట నుండి వెలుగు బాటకు…
అవును… ఈ పేద యానాదులు ఒకపుడు అడవుల్లో తాబేళ్లు, కుందేళ్లు, ఎలుకలు, పక్షులను వేటాడి పొట్ట పోషించుకునేవారు. చెరువుల్లో చేపలను పట్టి అమ్మేవారు. ఇవేమీ దొరకనపుడు వెల్లగడ్డలు, బిక్కిపండ్లు, నేరేడు పండ్లు ఏరుకొని ఆకలి తీర్చుకునేవారు. ఈత ఆకులు తెచ్చుకొని చాపలు అల్లుకొని బతికేవారు. 
స్థిరత్వం లేని బతుకులు చిత్తూరు జిల్లా దిగువ పుత్తూరు గిరిజనులవి. ఈ గ్రామం|| కె.వి.బి. పురం మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో వుంది. అక్కడున్న 185 మంది యానాదుల బతుకు చిత్రమిది. నెలకు వీరి తలసరి ఆదాయం రూ. 2500 నుండి రూ.3500 మాత్రమే… వీరు భూమి కోసం అనేక పోరాటాలు చేశాక కొందరికి ప్రభుత్వం 1994లో భూమి పట్టాలిచ్చింది. ఒక్కొక్కరికి ఎకరా చొప్పున 45 మందికి భూమి దొరికింది. అయితే వెంటనే దున్నుకొని పంటలు పండించుకోవడానికి అనువైన నేల కాదది. రాళ్లురప్పలతో కొండల మధ్య ఉంది. దీనిని అభివృద్ధి చేసుకునే స్తోమత లేక ఇతర కూలి పనులు చేసుకుని బతికేవారు. 
వీరి బతుకుల్లో మార్పుకోసం ప్రగతి సంస్థ నాబార్డు సాయంతో వీరి భూముల్లో పండ్ల తోటల సాగుచేయాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేసింది.దీంతో వీరు మామిడి,ఉసిరి తోటలు నాటారు. మరో రెండేళ్లలో అవి కాతకు వస్తాయి. ఈ లోపు బతకు తెరువుకోసం ఆకుకూరలు పండించుకుంటున్నారు. వారు తినగా మిగిలినవి స్ధానిక సంతలో అమ్మి జీవిస్తున్నారు. ఈ చిన్న వెలుతురు కిరణం చాలు … వారి చీకటి బతుకులు మారడానికి…

Share.

Comments are closed.